సెయింట్ లూయీస్‌లో భారీ ర్యాలీ
వైఎస్సార్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తరలివచ్చిన అభిమానులు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు 16 నెలల తర్వాత బెయిల్‌పై విడుదల కావడంతో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. సెయింట్ లూయీస్‌లో వైఎస్సార్ యువసేన ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సంబరాలు జరిగాయి. అక్కడి స్థానిక మహత్మాగాంధీ సెంటర్‌లో వైఎస్ అభిమాని పమ్మి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం భారీ ర్యాలీ తీశారు.
అనంతరం వైఎస్సార్ యువసేన యూఎస్‌ఏ కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సేయింట్ లూయీస్‌లో సభను ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రƒ శేఖర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఫోన్ ద్వారా ప్రసంగించారు. తాము ఆది నుంచి జగన్ వెంటే ఉంటున్నామని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ భారీ విజయాన్ని సాధిస్తుందని మేకపాటి ధీమా వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యం సాధించే వరకు మద్దతు ఇలాగే కొనసాగాలని గడికోట ఆకాక్షించారు. ఈ సభలో పలువురు సాఫ్‌టవేర్ ఉద్యోగులు మాట్లాడారు. సాఫ్‌టవేర్ నిపుణుడు షేక్ కబీర్ మాట్లాడుతూ.. వైఎస్సార్ వల్లే రాష్ట్రంలోని మైనార్టీల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. కిరణ్ మలుపు, సి.రంగ , శ్రీకాంత్ జొన్నల తదితర ఉద్యోగులు వైఎస్సార్ సంక్షేమ పథకాలను ప్రస్తావించారు.
ప్రముఖ వైద్యుడు గొండిపల్లి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఒక డాక్టర్‌గా వైఎస్ అందించిన సేవలను కొనియాడారు. జగన్‌లో వైఎస్‌లోని కమిట్‌మెంట్, అంకితభావం, శ్రమించేతత్వం, విజన్ ఉందన్నారు. వైఎస్సార్ యువసేన యూఎస్‌ఏ కమిటీ బొంతు నాగిరెడ్డి మాట్లాడుతూ... ఈ సంబరాలు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సాధించబోయే విజయాలకు ముందస్తు సంకేతమన్నారు. స్థానిక వ్యాపారవేత్త చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ వైఎస్ కుటుంబానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తాటిపర్తి, బి.దినేష్, రవి ఉప్పలపాటి, విజయనాగ ఇందుకూరి, రామకృష్ణ దగ్గుమతి, సాయి తారపరెడ్డి, శివరామరాజు, మురళిరాజు గొట్టిముక్కల, లింగారెడ్డి గన్నపనేని, శ్రీను దగ్గుమతి, వెంకట్ కాట్రగడ్డ, నంద పుప్పల, వంశీరెడ్డి మోపూరు, చందు తారపరెడ్డి, కిరణ్ మలుపూరు, రవికాంత్, విజయకుమార్‌రెడ్డి, వేదనపతిలతో పాటు వందలాది పాలుపంచుకున్నారు. మహిళలు, పిల్లలు, జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలుపుతూ కేక్ కట్ చేశారు.
మేమంతా మీ వెంటే.. జగన్ విడుదలపై అమెరికాలో సంబరాలు
Published Wed, Oct 2 2013 3:06 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement