బెయిల్‌పై అనంతబాబు విడుదల
విశాఖపట్నం :వైఎస్సార్ కాంగ్రెస్ తూర్పు గోదావరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ శనివారం బెయిల్‌పై విడుదలయ్యారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఫిర్యాదుతో ఉదయభాస్కర్‌ను అరెస్టు చేసి, రిమాండ్ ఖైదీగా విశాఖ కేంద్ర కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్‌కుమార్, పార్టీ అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు వాసిరెడ్డి జమీలు జైలు వద్ద ఉదయభాస్కర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉదయభాస్కర్‌పై అక్రమ కేసులు బనాయించారన్నారు. పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరారు.