విచారణకు రావాలని సీఐడీ చీఫ్ కు హైకోర్టు ఆదేశం | andhra pradesh cid chief ordered by high court to attend court | Sakshi
Sakshi News home page

విచారణకు రావాలని సీఐడీ చీఫ్ కు హైకోర్టు ఆదేశం

Published Mon, Oct 5 2015 12:22 PM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM

విచారణకు రావాలని సీఐడీ చీఫ్ కు హైకోర్టు ఆదేశం - Sakshi

విచారణకు రావాలని సీఐడీ చీఫ్ కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ను హైకోర్టు ఆదేశించింది. నిందితులను అరెస్ట్ చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారని సీఐడీని ప్రశ్నించింది. అగ్రిగోల్డ్ ఆస్తులు, లావాదేవీల వివరాలను సమర్పించాలని ఆదేశించింది.

సోమవారం అగ్రిగోల్డ్ కేసు విచారణను చేపట్టిన హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఈ కేసులో సీఐడీ విచారణ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ చైర్మన్ సహా నలుగురు డైరక్టర్లు కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు సమర్పించిన ఆస్తుల వివరాలు సక్రమమేనని అఫిడవిట్ దాఖలు చేయాలని, ఏవైనా తప్పులు ఉంటే అగ్రిగోల్డ్దే బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement