యానిమేషన్ సిటీ ఏర్పాటుకు చర్యలు వేగవంతం
Published Fri, Aug 9 2013 3:19 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
హైదరాబాద్‌లోని రాయదుర్గంలో యానిమేషన్,గేమింగ్ సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ శాఖ ముమ్మర చర్యలు చేపట్టనుంది. ఇందుకు సంబంధించి ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గురువారం ఐటీ, ఏపీఐఐసీ అధికారులతో సమావేశమయ్యారు. గేమ్‌సిటీలో ఇంక్యుబేషన్ టవర్ నిర్మాణానికి సెప్టెంబరులోగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. లేఅవుట్ ప్లాన్ సిద్ధం చేసేందుకు టెండర్లు పిలవాలని, రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఐటీ లే-అవుట్ రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Advertisement