
ముంబైపై మరో ఉగ్రదాడికి కుట్ర?
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై మరో ఉగ్రదాడికి లష్కరే తాయిబా కుట్ర పన్నుతోందా? ఈసారి కూడా హోటళ్లు, రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుంటోందా? నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది. సముద్రమార్గం గుండా ఉగ్రవాదులు చొరబడొచ్చని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరిస్తోంది.
26/11 తరహా దాడులు జరిగే ప్రమాదం ఉందని సమాచారం. ప్రధానంగా ముంబై రైళ్లలో హై ఎలర్ట్ ప్రకటించారు. 8-10 మంది ఉగ్రవాదులు చొరబడొచ్చన్నది నిఘా వర్గాల హెచ్చరికల సారాంశం. ఈ నేపథ్యంలో ముంబై నగర వ్యాప్తంగా హై ఎలర్ట్ ప్రకటించారు. ఇంతకుముందు 2011 నవంబర్ 26వ తేదీన ఉగ్రవాదులు దాడి చేసి భారీ ప్రాణనష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే.
మరోసారి ఈ తరహా దాడులు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు రోజుల క్రితమే జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ కూడా జైలు నుంచి విడుదల కావడంతో.. ఇప్పుడు మరో దాడికి కుట్ర పన్నే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.