గోవింద్ పన్సారే కన్నుమూత | Anti-Toll Tax Campaigner Govind Pansare, Shot in Kolhapur on Monday, Dies | Sakshi
Sakshi News home page

గోవింద్ పన్సారే కన్నుమూత

Published Sat, Feb 21 2015 12:28 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

గోవింద్ పన్సారే కన్నుమూత - Sakshi

గోవింద్ పన్సారే కన్నుమూత

ముంబై : దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ నాయకుడు గోవింద్ పన్సారే శుక్రవారం కన్నుమూశారు. మహారాష్ట్రలో టోల్ చార్జీల వసూళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన గోవింద్ పన్సారే  దంపతులు సోమవారం కోల్హాపూర్ లో మార్నింగ్ వాక్ కు వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో పన్సారే తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. భార్య సౌమ పన్సారే శరీరంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది.

వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన్ని మెరుగైన వైద్య చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్లో శుక్రవారం సాయంత్రం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. పన్సారే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement