'జయలలిత నాకు చెల్లెలులాంటిది' | apart from politics I treat her like sister: MDMK chief Vaiko | Sakshi
Sakshi News home page

'జయలలిత నాకు చెల్లెలులాంటిది'

Published Mon, Dec 5 2016 4:34 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

'జయలలిత నాకు చెల్లెలులాంటిది'

'జయలలిత నాకు చెల్లెలులాంటిది'

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి గడిచేకొద్ది విషమంగా మారుతుండటంతో పార్టీలు, రాజకీయాలకతీతంగా ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. రాజకీయాలను పక్కనబెడితే జయలలిత తనకు చెల్లెలు లాంటిదని ఎండీఎంకే అధినేత వైగో చెప్పారు. అపోలో వైద్యులు జయలలితకు అధునాతన చికిత్సను అందిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ఆందోళనకర పరిస్థితి నుంచి ఆమె త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
 
మరో వైపు అపోలో ఆసుపత్రి వర్గాలు, లండన్కు చెందిన ప్రఖ్యాత వైద్య నిపుణుడు ప్రొఫెసర్ రిచర్డ్ బేలే  ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడేందుకు తాము శాయశక్తులా కృషిచేస్తున్నామని, కానీ ఆమె పరిస్థితి విషమంగా మారుతున్నట్టు పేర్కొన్నారు. దీంతో తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా జయలలిత ఆరోగ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. తమిళనాడు రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థిగా ఉన్న కరుణానిధి, ప్రతిపక్ష నేత స్టాలిన్లు కూడా జయ పూర్తిగా కోలుకోవాలని కోరుతున్నట్టు ఉదయం ట్వీట్లు చేశారు. మరోవైపు ఆమె కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement