త్వరలో ఆర్టీసీ ఛార్జీల మోత! | APSRTC proposes 10-15% hike in bus fares | Sakshi
Sakshi News home page

త్వరలో ఆర్టీసీ ఛార్జీల మోత!

Published Wed, Aug 19 2015 6:02 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

త్వరలో ఆర్టీసీ ఛార్జీల మోత! - Sakshi

త్వరలో ఆర్టీసీ ఛార్జీల మోత!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ప్రయాణికులపై భారం మోపేందుకు రంగం సిద్ధమవుతోంది. బస్సు ఛార్జీలను10 నుంచి 15 శాతం వరకు పెంచే అవకాశముంది. ప్రభుత్వానికి ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్టు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చెప్పారు.

ఏపీఎస్ ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోందని సాంబశివరావు తెలిపారు. నష్టాల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బయటపడాలంటే బస్సు ఛార్జీలు పెంచడం మినహా మరో గత్యంతరం లేదని చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి విజయవాడ నుంచే ఏపీఎస్ ఆర్టీసీ పనిచేస్తుందని సాంబశివరావు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement