భండారీపై నల్లధన నిరోధక కేసు నమోదు
న్యూఢిల్లీ: ఆయుధాల సరఫరాదారు సంజయ్ భండారీపై నల్లధన నిరోధక చట్టం కింద ఆదాయపు పన్ను శాఖ తొలి కేసు నమోదు చేసింది. అలాగే భారత్‌తో పాటు విదేశాల్లో ఉన్న అతని ఆస్తుల్ని అటాచ్ చేసే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఆదాయపు పన్ను చట్టాల కింద కూడా భండారీపై విచారణ చేస్తున్నామని ఐటీ అధికారులు వెల్లడించారు.
భండారీ, అతని సహచరులకు సంబంధించి అరడజను విదేశీ ఆస్తుల్ని గుర్తించామని, స్వదేశంలోని ఆస్తులపై కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ కేసుల్లో నేరం రుజువైతే 120 శాతం పన్ను, జరిమానాతో పాటు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. గతేడాది ఏప్రిల్‌లో ఢిల్లీలోని భండారీ కార్యాలయాలపై దాడుల సందర్భంగా ఈ కేసు వెలుగులోకి వచ్చింది.