కేజ్రీవాల్తో విందు కలెక్షన్ రూ. 50 లక్షలు | Arvind Kejriwal dinner collects Rs 50 lakh | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్తో విందు కలెక్షన్ రూ. 50 లక్షలు

Published Sun, Mar 16 2014 1:03 PM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM

కేజ్రీవాల్తో విందు కలెక్షన్ రూ. 50 లక్షలు

కేజ్రీవాల్తో విందు కలెక్షన్ రూ. 50 లక్షలు

బెంగళూరు: అరవింద్ కేజ్రీవాల్తో విందు సమావేశం ద్వారా రూ. 50 లక్షలు సేకరించినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వెల్లడించింది. బెంగళూరులో శనివారం రాత్రి కేజ్రీవాల్తో ఏర్పాటు చేసిన విందు భేటీకి 200 మందిపైగా హాజరయ్యారని ఆప్ నాయకులు తెలిపారు. పార్టీ కోసం విరాళ సేకరణలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పారదర్శకంగా విరాళాలు సేకరించేందుకు ఆప్ మద్దతుదారులు, బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఇన్ఫోసిస్ మాజీ బోర్డు సభ్యుడు వి. బాలకృష్ణన్ ఈ కార్యక్రమం నిర్వహించారు.

విందుకు హాజరుకాలేకపోయిన మరికొందరు తమకు విరాళాలు ఇస్తామని హామీయిచ్చారని బాలకృష్ణన్ తెలిపారు. కేజ్రీవాల్తో విందు భేటీ చాలా బాగా జరిగిందని చెప్పారు. మీడియాపై చేసిన ఆరోపణల గురించి కేజ్రీవాల్ను ప్రధానంగా ప్రశ్నించారని వెల్లడించారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని గుజరాత్ చీకటి కోణాలను చూపించే దమ్ము మీడియాకు లేదని కేజ్రీవాల్ విమర్శించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement