
కేజ్రీవాల్ జనతా దర్బార్
ఢిల్లీ: పాలనలో సమూల మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో గద్దెనెక్కిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జనతా దర్బార్ ఈ రోజు మొదలైంది. పలువురు నేతలతో ఆయన వరుసగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేజ్రీ వాల్ మాట్లాడుతూ వారం, 10 రోజుల్లో అన్ని సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవస్థ మొత్తాన్ని గాడిలో పెడతానన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్ నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ జీవితంలో ఎప్పుడూ ఎవరికీ లంచం ఇవ్వను, తీసుకోను అని అందరూ శపథం చేయాలని కోరిన విషయం తెలిసిందే. వ్యవస్థను సమూలంగా మార్చాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు.