స్మగ్లింగ్ కేసులో బంగ్లాదేశ్ కోర్టు తీర్పు
ఢాకా: పది ట్రక్కుల్లో ఆయుధాలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన కేసులో యునెటైడ్ లిబరేషన్ ఆఫ్ అస్సాం (అల్ఫా) అగ్రనేత, భారత్ మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ పరేశ్ బారువాకు బంగ్లాదేశ్‌లోని ఓ కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. పదేళ్ల కిందటి ఈ కేసులో మరో 13 మందికీ మరణదండన వేసింది. వీరిలో జమాతే ఇస్లామీ చీఫ్, బంగ్లా మాజీ మంత్రు లు మతీర్ రెహ్మాన్ నిజామీ, లుత్‌ఫోజమాన్ బాబర్, మాజీ సైనిక జనరళ్లు అబ్దుల్ రహీం, రజాకుల్ చౌధురి తదితరులున్నారు. అక్రమాయుధాలు, స్మగ్లిం గ్ చట్టాల కింద రెండు కేసుల్లో వీరిపై విచారణ జరి గింది. హైకోర్టు డివిజన్ అనుమతితో శిక్షలు విధిం చినట్లు చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ మొదటి ప్రత్యేక ట్రిబ్యునల్ జడ్జి ప్రకటించారు. పరారీలో ఉన్న బారు వా గైర్హాజరీలో కోర్టు ఆయనకు శిక్ష వేసింది.
అల్ఫా అగ్రనేత బారువాకు మరణశిక్ష
Published Thu, Jan 30 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
Advertisement
Advertisement