ఉల్ఫా నేత పరేశ్ బారువాకు మరణశిక్ష!
2004 అయుధాల అక్రమ రవాణా కేసులో ఉల్ఫా ఫ్యాక్షన్ నేత పరేశ్ బారువాకు బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. ఈ కేసులో మరో 13 మందికి మరణశిక్ష అమలు చేయాలని హైకోర్టు డివిజన్ అనుమతితో కోర్టు ఆదేశించింది. మరణ శిక్ష విధించిన వారిలో జమాత్ చీఫ్, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి మోతీర్ రాహ్మన్ నిజామీ, హోంమంత్రి లుత్పోజమాన్ బాబర్ కూడా ఉన్నారు.
పది ట్రక్కుల ఆయుధాలను అక్రమంగా తరలిస్తుండగా కర్నఫులి నది వద్ద చిట్టగాంగ్ యూరియ ఫెర్టిలైజర్ లిమిటెడ్ సమీపంలో పట్టుకుని 4930 అత్యాధునిక ఆయుధాలు, 840 రాకెట్ లాంచర్లు, 300 రాకెట్లను, 27020 గ్రెనేడ్స్, 2 వేల గ్రేనేడ్ లాంచిగ్ ట్యూబ్, 6392 మ్యాగజైన్స్, 11.41 మిలియన్ల బుల్లెట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం బంగ్లాదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిది. ఈకేసులో ప్రధాన నిందితులైన బారువా, మాజీ పరిశ్రమల కార్యదర్శి నురుల్ అమిన్ లు ఇప్పటి వరకు పోలీసులకు పట్టుపడకుండా అజ్గాతంలో ఉన్నారు.