నీకు చెల్లెలవుతుంది!! | Behen Hogi Teri Trailer | Sakshi
Sakshi News home page

నీకు చెల్లెలవుతుంది!!

Published Tue, May 2 2017 5:53 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

నీకు చెల్లెలవుతుంది!!

నీకు చెల్లెలవుతుంది!!

‘భారతీయులందరూ నా సోదరసోదరీమణులు’ .. పాఠశాలలో పిల్లలు తరచూగా చేసే ప్రతిజ్ఞ ఇది. కానీ ఈ ప్రతిజ్ఞకు కాస్తా కామెడీ టచ్‌ ఇస్తూ యువతీయువకుల ప్రేమకథను సరికొత్తరీతిలో తెరకెక్కించాడు అజయ్‌ కే పన్నాలాల్‌. రాజ్‌కుమార్‌ రావు, శృతిహాసన్‌ జంటగా తెరకెక్కిన తాజా హిందీ సినిమా ‘బెహెన్‌ హోగీ తేరి’.. ఫుల్‌లెంత్‌ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఈ సినిమాలో రాజకుమార్‌ గట్టుగా కనిపించనుండగా.. అతని బాల్యపు ప్రేమికురాలు, పక్కింటి అమ్మాయి బిన్నీ అరోరాగా శృతి హాసన్‌ నటించనుంది. పక్కింటి అమ్మాయిని సోదరిలాగా చూడాలని అంతా అంటే గట్టు మాత్రం అందుకు భిన్నంగా బిన్నీని ప్రేమిస్తాడు. ఈ నేపథ్యంలో  వారి ప్రేమకథ, ఫ్యామిలీ డ్రామా ఎలా సాగిందనేది ఈ సినిమా కథ. కడుపుబ్బా నవ్వించేలా ఉన్న ఈ ట్రైలర్‌ను నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement