
ఆధార్ లేకున్నా ప్రయోజనాలు
న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్ లేనంతమాత్రాన ప్రభుత్వ ప్రయోజనాలు లభించని పరిస్థితి ఎవరికీ రాకుండా చూడాలని బుధవారం సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఎల్పీజీ పథకాలకు మినహాయించి మిగతా పథకాల్లో ఆధార్‌ను స్వచ్ఛందంగా మాత్రమే వినియోగించేలా చూస్తామన్న కేంద్రం వివరణను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సంక్షేమ పథకాల ప్రయోజనం పొందేందుకు ఆధార్‌ను తప్పని సరి చేయబోమని హామీ ఇస్తారా? ఆధార్ లేకపోతే ఆ ప్రయోజనాలు అందని పరిస్థితి ఉండదన్న హామీ ఇస్తారా?
అని చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నిం చింది. దానికి సానుకూలంగా సమాధానమిచ్చిన అటార్నీ జనరల్.. ఆధార్‌లేని వారికి సైతం ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతాయని స్పష్టం చేశారు.