నేరస్తులే ఎక్కువ
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కన్నా.. నేరస్తులు, కోటీశ్వరుల బలమే ఎక్కువ సీట్లు సంపాదించింది. అసెంబ్లీకి ఎన్నికయిన వారిలో 143 మంది(58 శాతం) నేరచరితులు ‘అధ్యక్ష్యా!’ అనేందుకు సిద్ధమయ్యారు.
అందులో 96 మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ వంటి తీవ్రమైన కేసులున్నాయి. ఎన్నికైన వారిలో అర్జేడీ నుంచి అత్యధికంగా 46 మంది ఉన్నారు. జేడీయూ నుంచి 37 మంది, బీజేపీ నుంచి 34 మంది, కాంగ్రెస్ నుంచి 16 మంది ఉన్నారు.