రాజస్థాన్లో బిజెపి ఘనవిజయం:80శాతంపైగా స్థానాల్లో గెలుపు | BJP grand victory in Rajasthan | Sakshi
Sakshi News home page

రాజస్థాన్లో బిజెపి ఘనవిజయం

Published Sun, Dec 8 2013 8:31 PM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM

BJP grand victory in Rajasthan

జైపూర్: రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించింది. ఈ రాష్ట్రంలో అన్ని ఫలితాలు వెలువడ్డాయి. 80శాతంపైగా స్థానాలను బిజెపి గెలుచుకుంది. మొత్తం 200 స్థానాలకు 162 స్థానాలను బిజెపి గెలుచుకుంది.   జలర్‌పఠాన్‌ నియోజకవర్గంలో బీజేపీ సీఎం అభ్యర్థి వసుంధరా రాజే  60వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.సాదుల్షహర్, పింద్వారా-అబూ, రియోడర్(ఎస్సీ) స్థానాల్లో బీజేపీ గెలుపొందింది.
 
కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీ 21 స్థానాల్లో మాత్రమే గెలిచింది.   నేషనల్స్ పీపుల్స్ పార్టీ  నాలుగు స్థానాలను, బిఎస్పి  మూడ స్థానాలను,  స్వతంత్ర అభ్యర్థులు ఏడు స్థానాలను,   నేషనల్ యూనియనిస్ట్ జమిందార్ పార్టీ రెండు స్థానాలను గెలుచుకున్నాయి.   బిజెపి 78 స్థానాల నుంచి 162 స్థానాలకు ఎగబాకగా, కాంగ్రెస్ 96 స్థానాల నుంచి 21 స్థానాలకు పడిపోయింది.


రాజస్థాన్‌లో 200 సీట్లు ఉండగా 199 సీట్లకు పోలింగ్ జరిగింది.  బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో చురు స్థానంలో ఓటింగ్‌ను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement