న్యూఢిల్లీ: పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చే విషయంలో బీజేపీ మంగళవారం స్పష్టత ఇవ్వనుంది. రేపు మధ్యాహ్నం బీజేపీ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. తెలంగాణపై పార్టీ అభిప్రాయాన్ని ఆమె వెల్లడించనున్నారు.
బీజేపీ సీనియర్ నేత అద్వానీ నివాసంలో సోమవారం ఆ పార్టీ జాతీయ నేతలు సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. అయితే సమావేశం వివరాల్ని బయటకు వెల్లడించలేదు. సీమాంధ్రలో చిచ్చు రేపి రాష్ట్రాన్ని విభజిస్తోందంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సహా అగ్రనేతలు కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారు. దీంతో తెలంగాణకు మొదట్నుంచి మద్దతు పలుకుతున్న బీజేపీ తమ వైఖరి మార్చుకుందా అనే కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రేపు తెలంగాణపై స్పష్టత ఇవ్వనున్న బీజేపీ
Published Mon, Feb 3 2014 8:14 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement