షాపింగ్ బిల్లులపై ఐటీ కన్ను | Black money: IT department watching your shopping bill to identify big-spenders | Sakshi
Sakshi News home page

షాపింగ్ బిల్లులపై ఐటీ కన్ను

Published Wed, Sep 7 2016 11:55 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

షాపింగ్ బిల్లులపై ఐటీ కన్ను - Sakshi

షాపింగ్ బిల్లులపై ఐటీ కన్ను

షాపింగ్ బిల్లులపై ఐటీ డిపార్ట్మెంట్ దృష్టిసారించింది. అతిపెద్ద కారు షోరూంలు, ప్రాపర్టీ బిల్డర్స్, ట్రావెల్ ఏజెంట్స్, లగ్జరీ ఐటమ్స్ విక్రయదారుల నుంచి ఎక్కువగా మొత్తంలో షాపింగ్ ఖర్చుచేసిన వారి వివరాలను ఐటీ శాఖ సేకరిస్తోంది. సెప్టెంబర్ 30తో టాక్స్-కంప్లీయన్స్ విండో గడువు ముగియనుండటంతో, బ్లాక్ మనీ ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని ఐటీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్య సాధన కోసం అత్యధిక మొత్తంలో డీల్స్ జరిపి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసిన, బ్లాక్ మనీ చూపని పన్ను ఎగవేతదారుల వివరాలను షాపింగ్ బిల్లుల ద్వారా ఐటీ అధికారులు గుర్తించనున్నారు. 2009 నుంచి ఈ ఏడాది వరకు జరిపిన అన్ని ఒప్పందాలను, కొనుగోలను పరిశీలించనున్నట్టు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో రూ.10 లక్షలకు పైగా లావాదేవీలు, సేవింగ్స్ అకౌంట్లో అత్యధిక మొత్తంలో నగదు ఉన్న అకౌంట్లు, రూ.30 లక్షలు అంతకంటే ఎక్కువకు స్థిరాస్తుల కొనుగోలు లేదా అమ్మక లావాదేవీల వివరాలను ఐటీ శాఖ పరిశీలించనుంది. 
 
పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపిన 9 లక్షల మంది వివరాలు ఇప్పటికే ఐటీ డిపార్ట్మెంట్ దగ్గరున్నాయని, వారికి త్వరలోనే నోటీసులు జారీచేయనున్నట్టు అధికారులు స్పష్టంచేశారు. ఎక్కువ మొత్తంలో ఖర్చుచేసిన వారి డేటా బేస్ వివరాలను పాన్ సమాచారం, బ్యాంకు లావాదేవీలు, మొబైల్ మనీ ట్రాన్స్ఫర్, షోరూం లగ్జరీ ఐటమ్స్ వంటి వివిధ మార్గాల్లో సేకరిస్తున్నామని ఐటీ డిపార్ట్మెంట్ తెలిపింది. అదేవిధంగా పన్ను ఎగవేతదారులను కనుగొనడానికి సోషల్ మీడియాను కూడా టార్గెట్ చేసినట్టు వెల్లడించారు. చాలామంది కొత్త వాహనం కొన్నప్పుడు, ఫారిన్ ట్రిప్లకు వెళ్లినప్పుడు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారని, వాటి ద్వారా పన్ను ఎగవేసిన వారి వివరాలు తెలిస్తే నోటీసులు కూడా జారీచేస్తామని స్పష్టంచేశారు. అధిక మొత్తంలో లావాదేవీలకు పాన్ను తప్పనిసరి చేస్తూ.. రూ.3 లక్షలకు పైగా నగదు లావాదేవీలపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, ఇంకా ఆ లావాదేవీలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. స్థిరాస్తుల, జువెల్లరీ  కొనుగోలకు, ఎడ్యుకేషన్ ఫీజు, పార్టీలు, వివాహ కార్యక్రమాకలు, కారు కొనుగోలు, ఆసుప్రతి బిల్స్ వంటి వాటిల్లో రూ.3 లక్షలకు పైగా నగదు లావాదేవీలను ప్రజలు ఎక్కువగా వాడుతున్నట్టు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement