లాహోర్‌లో బాంబు పేలుడు, 16 మంది మృతి
లాహోర్: పాకిస్థాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. సోమవారం సాయత్రం పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్లో అసెంబ్లీ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ దాడిలో సీనియర్ పోలీసు అధికారులతో సహా కనీసం 16 మంది మరణించనట్టు సమాచారం. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
నిరసనలు జరుగుతున్న ఈ ప్రాంతంలో పేలుడు పదర్ధాలు నింపిన వాహాన్ని పేల్చివేసినట్టు పాక్ మీడియా కథనం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఈ దాడి చేసింది ఎవరు? ఉగ్రవాదులు హస్తం ఉందా? వంటి విషయాలు తెలియాల్సి వుంది. గతేడాది లాహోర్లోనే పబ్లిక్ పార్క్‌లో సంభవించిన బాంబు పేలుడులో దాదాపు 70 మంది మరణించారు.