
ఆఫీసులో ఫేస్ బుక్ చూస్తే అంతే!
రోమ్: ఆఫీసుల్లో ఫేస్ బుక్ చూసే ఉద్యోగులకు షాకింగ్ న్యూస్. స్టాఫ్ పేస్ బుక్ ఖాతాలపై బాసులు నిఘా పెట్టడం తప్పుకాదని ఇటలీ సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆఫీసు పనిచేస్తూ ఫేస్ బుక్ చూసేవారిపై నిఘా ఉంచడం చట్ట ఉల్లంఘన కాబోదని ఇటలీ అత్యున్నత న్యాయస్థానం గురువారం రూలింగ్ ఇచ్చింది. ప్రింటర్ అనే వ్యక్తికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది.
తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగి అదే పనిగా ఫేస్ బుక్ మెసేంజర్ లో ఓ మహిళాతో ఛాటింగ్ చేస్తుండడంతో ప్రింటర్ తొలగించాడు. ప్రింటర్ వేరే పేరుతో నకిలీ పేస్ బుక్ ఖాతా తెరిచి ఈ విషయాన్ని కనుగొన్నాడు. ప్రింటర్ చర్యను కోర్టు సమర్థించింది. తన దగ్గర పనిచేసే ఉద్యోగులు ఆఫీసులో మొబైల్ ఫోన్లలో ఫేస్ బుక్ చూస్తుంటే వారిపై నిఘా పెట్టేందుకు యజమానికి అధికారం ఉందని ఇటలీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఆఫీసుల్లో ఫేస్ బుక్ ఓపెన్ చేసే వారు కాస్త వెనుకాముందు ఆలోచించుకుంటే మంచిది.