అంబానీ అకౌంట్ హ్యక్ చేసిన హైదరాబాదీ అమ్మాయి!
Published Fri, Sep 13 2013 4:00 PM | Last Updated on Thu, Sep 27 2018 4:27 PM
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఆదాయపు పన్ను రిటర్న్ ఈ-ఫైలింగ్ అకౌంట్ ను హైదరాబాద్ కు చెందిన యువతి హ్యక్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చార్టెండ్ అకౌంటెన్సీ అర్టికల్ షిప్ చేస్తున్న 21 ఏళ్ల విద్యార్థినిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబానీ ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే హ్యకింగ్ కు హ్యకింగ్ కు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లోని మనోజ్ దాగా అండ్ కంపెనీలో ఆర్టికల్ షిప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత సెప్టెంబర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద సంబంధిత సెక్షన్ల తో కేసు నమోదు చేసినట్టు సమాచారం.
గత కొంతకాలంగా ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. అనిల్ ధిరూబాయి అంబానీ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అకౌంట్ ను హ్యక్ చేసిన తర్వాత.. ఐటీ వెబ్ సైట్ ను సందర్శించి ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలను, పాన్ కార్డ్ నంబర్ ను సేకరించడమే కాకుండా, రెండుసార్లు పాస్ వర్డ్ ను మార్చినట్టు విచారణలో వెల్లడైంది.
గత 54 ఏళ్లుగా అంబానీ ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న ఓ చార్టెడ్ అకౌంట్ కంపెనీ నిర్వాహకులు ఈమెయిల్ ద్వారా ఐటీ డిపార్ట్ మెంట్ కు జూన్ 26, జూలై 12 తేదిన అకౌంట్ ను వివారాలను మార్చినట్టు ఫిర్యాదు చేశారు. అయినా ఇంకా అనుమానాలు తలెత్తడంతో జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) కు అడాగ్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసు అధికారి హిమాంశు రాయ్.. సైబర్ సెల్ ఇన్స్ పెక్టర్ ముకుంద్ పవార్ కు విచారణ చేయాలని ఆదేశించారు.
విచారణ ప్రారంభించిన సైబర్ పోలీసులు.. హైదరాబాద్ లోని మనోజ్ దాగా అండ్ కంపెనీ నుంచి హ్యకింగ్ జరిగిందని ధృవీకరించారు. దాంతో ఆసంస్థలో ఆర్టికల్ షిప్ చేస్తున్న విద్యార్థినిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత హ్యకింగ్ కు సంబంధించిన కంప్యూటర్ ను సీజ్ చేశారు. సైబర్ నేరానికి పాల్పడినట్టు ప్రాధమిక, సాంకేతిక సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని.. ఈ కేసు నాన్ బెయిలబుల్ పరిధిలోకి వస్తుందని సైబర్ ఇన్స్ పెక్టర్ పవార్ తెలిపారు.
Advertisement
Advertisement