CA student
-
డ్రగ్స్ విక్రేతగా మారిన సీఏ విద్యార్థి
బెంగళూరు : నగరంలోని తిలక్‌నగరలో పోలీసులు గురువారం దాడి చేసి గుంటూరుకు చెందిన వికట్‌రాజ్ (27) అనే విద్యారి్థని అరెస్ట్ చేసి 1.2 కేజీల మాదక ద్రవ్యాలు, 3 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. బీకాం పూర్తి చేసిన నిందితుడు సీఏ కోర్సు చదువుతున్నట్లు సమాచారం. ఓ చార్టెట్ అకౌంట్ కార్యాలయంలో పనిచేస్తూ ఈజీ మనీ కోసం గుంటూరులో తన స్నేహితుడు ప్రవీణ్ నుంచి గంజాయి నూనెను తెప్పించి కేజీ రూ.5 – 6 లక్షల వరకు బెంగళూరులోని కోరమంగల, ఎస్జీ.పాళ్య, హెచ్ఎస్ఆర్.లేఔట్, జయనగర, జేపీ. నగర తదితర ప్రాంతాల్లో విద్యార్థులు, పరిచయస్తులకు అమ్మేవాడని తేలింది. కేసు విచారణలో ఉంది. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లు అరెస్ట్ యశవంతపుర: నైజీరియా పౌరుడితో పాటు కేరళకు చెందిన డ్రగ్స్ పెడ్లర్లను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 25 లక్షలు విలువగల డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకున్నారు. యలహంకలో ఇద్దరు నిందితులు మత్తు పదార్థాలు విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. -
ఆన్లైన్ గేమ్స్‌కు సీఏ విద్యార్థి బలి
మంచిర్యాలక్రైం: ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడిన ఓ విద్యార్థి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాజమౌళిగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... నస్పూర్‌కు చెందిన రవి–లలిత దంపతుల రెండో కుమారుడు అభిలాష్ (25) సీఏ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఇంటి వద్దనే ఉండడంతో సరదాగా ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటుపడ్డాడు. తర్వాత సరదా కాస్త..వ్యసనంగా మారి అప్పుల పాలై బలవంతంగా తనువు చాలించాడు. హైదరాబాద్ వెళ్తున్నాని ఇంట్లో నుంచి వెళ్లి పోయిన అభిలాష్ ఈ నెల 27న స్థానిక తోళ్లవాగు శివారులో పురుగుల మందు తాగి పడి ఉన్నాడు. అటువైపు వెళ్లిన వారు అభిలాష్‌ను గమనించి దగ్గరికి వెళ్లి చూడగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. అభిలాష్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తన చేతిపై ఉన్న ఓ సెల్ నంబర్‌కు సమాచారం అందించారు. అది అభిలాష్ అన్నయ్య ఆకాష్‌ది కావడంతో వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. (రాచకొండలో 12 శాతం తగ్గిన క్రైమ్ రేట్ ) -
వయసు 25ఏళ్లు.. చేసిన మోసం రూ. 50 కోట్లు
అహ్మదాబాద్: ఇరవై ఐదేళ్ల సీఏ విద్యార్థిని వడోదరలో జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు. టాక్స్ ఎగ్గొట్టడానికి ఫేక్ కంపెనీలను సృష్టించి 50.2 కోట్ల రూపాయల మేరకు తప్పుదారి పట్టించాడు. దీంతో అధికారులు అతనిని అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన మనీష్ కుమార్ ఖత్రీ 115 షల్ కంపెనీలు సృష్టించి, వివిధ రూపాలలో పన్ను ఎగ్గొట్టాడు. అనుమానాస్పద టాక్స్ పేయర్స్‌ను వెలికితీసే ప్రయత్నంలో ఖత్రీ వ్యవహారం రాష్ట్ర జీఎస్టీ అధికారుల దృష్టికి వచ్చింది. ఖత్రీ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి టాక్స్ కట్టాల్సిన డబ్బును వివిధ కంపెనీలకు తరలించి 50 కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దాహుద్ అనే చిన్న గ్రామంలో ఉన్న అమాయకుల నుంచి వారి బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకొని వారి పేరు మీద ఈ కంపెనీలు సృష్టించినట్లు అధికారులు కనుగొన్నారు. వారికి నెలకు కొంత మొత్తం చెల్లిస్తానని ఖత్రీ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కంపెనీలు పన్నులు ఎగ్గొట్టేందుకు సహకారం అందించేందుకుఫేక్ వెబ్‌సైట్‌తో నకిలీ కంపెనీలు సృష్టించినట్లు ఖత్రీ అంగీకరించాడు. చదవండి: గుజరాత్లో విషాదం: ముగ్గురు మృతి -
మిస్ ఇండియాగా సుమన్ రావ్
ముంబై: రాజస్తాన్‌కు చెందిన సీఏ విద్యార్థిని మిస్ ఇండియా–2019 విజేతగా నిలిచారు. ముంబైలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. మిస్ ఇండియా టైటిల్ గెలుచుకోవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. పరిస్థితులు ఎప్పటికీ చేజారవని, తనలాగే కలలు కంటున్న ఇతర మహిళలు భయపడకుండా కలలను సాకారం చేసుకోవచ్చన్న నమ్మకం ఈ టైటిల్ అందుకోవడం ద్వారా కలిగిందన్నారు. తన కుటుంబం, మిత్రులతో సంబరాలు జరుపుకోవడానికి వేచి ఉండలేకపోతున్నానని అన్నారు. డిసెంబర్లో బ్యాంకాక్‌లో జరుగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో కూడా పాల్గొననున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇంజినీర్ శివాని జాదవ్ మిస్ గ్రాండ్ ఇండియాగా నిలిచారు. బిహార్‌కు చెందిన మేనేజ్మెంట్ విద్యార్థిని శ్రేయా శంకర్ మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్‌గా నిలిచారు. తెలంగాణకు చెందిన సంజనా విజ్ మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచారు. ప్రముఖ డిజైనర్ ద్వయం ఫాల్గుని షేన్ పీకాక్, మిస్ వరల్డ్ 2018 వెనెస్సా పొన్కా డి లియోన్, నటులు హుమా ఖురేషి, చిత్రాంగ సింగ్, ఆయుష్ శర్మ, కొరియోగ్రాఫర్, చిత్రనిర్మాత రెమో డి సౌజా, స్ప్రింటర్ ద్యుతి చంద్, ఫుట్‌బాల్ టీం కెప్టెన్ సునీల్ ఛెత్రితో కూడిన బృందం విజేతలను ఎంపిక చేసింది. ఎంటెక్ చదువుతున్న సంజన... తెలంగాణకు చెందిన సంజనా విజ్ మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచారు. దీనితోపాటు మిస్ తెలంగాణ 2019 టైటిల్‌ను అందుకున్నారు. ఈమె యూపీలోని అమితీ యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో ఎం.టెక్ చదువుతున్నారు. -
పోలీసుల విచారణలో విద్యార్ధి ఆత్మహత్యాయత్నం
-
మనస్తాపంతో విద్యార్ధిని బలవన్మరణం
-
డెంగ్యూతో సీఏ విద్యార్థి మృతి
తిమ్మాజీపురం (వైఎస్సార్ జిల్లా) : సీఏ చదువుతున్న ఓ విద్యార్థి డెంగ్యూ వ్యాధితో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ జిల్లా తిమ్మాజీపురం మండలం కతనూరు గ్రామానికి చెందిన జగన్మోహన్రెడ్డి(22) విజయవాడలోని ఒక కళాశాలలో సీఏ చదువుతున్నాడు. కాగా గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతను తన స్వస్థలమైన కతనూరు గ్రామంలోని ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలోనే జ్వరం తగ్గకపోవడంతో తల్లిదండ్రులు బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా బెంగళూరులో చికిత్స పొందుతూ జగన్మోహన్రెడ్డి శనివారం మృతి చెందాడు. -
ప్రేమ విఫలమై సీఏ విద్యార్థి ఆత్మహత్య
ఆదిలాబాద్ : ఆర్థిక ఇబ్బందులతో పాటు, ప్రేమించిన అమ్మాయి మోసం చేయటంతో మనస్తాపం చెందిన ఓ సీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ భుక్తాపూర్ కాలనీకి చెందిన అక్షయ్ (22) విజయవాడలోని ఓ ప్రయివేట్ కళాశాలలో సీఐ చదువుతున్నాడు. దసరా సెలవులు కారణంగా ఇంటికి వచ్చాడు. సోమవారం రాత్రి అతను గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని...ఓ సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో సుమారు రూ.70వేల అప్పు చేయటంతో పాటు, ప్రేమించిన అమ్మాయి మోసం చేయటంతో తట్టుకోలేక అక్షయ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు వన్ టౌన్ ఎస్ఐ స్వామి తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కాగా చేతికి అంది వచ్చిన కొడుకు అకాల మరణంతో కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు. -
సీఏ విద్యార్థిని హ్యాకింగ్‌పై ఐసీఏఐ విచారణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ ఆదాయ పన్ను ఖాతాను హైదరాబాదీ సీఏ విద్యార్థిని హ్యాకింగ్ చేయడంపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) విచారణ జరపనుంది. ఆమెకు దీనిపై నోటీసు ఇవ్వనున్నట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ సుబోధ్ కుమార్ అగ్రవాల్ తెలిపారు. విద్యార్థిని ఆర్టికల్‌షిప్ చేస్తున్న సీఏ సంస్థ మనోజ్ దాగా అండ్ కంపెనీపై చర్యలేమైనా ఉంటాయా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. అనిల్ ఐటీ అకౌంటును హ్యాక్ చేసి ఆయన ఆదాయాలు, చెల్లిస్తున్న పన్నులు తదితర వివరాలను తస్కరించారని విద్యార్థిని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సర్కారుకు సిఫార్సులు చేస్తాం: మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ప్రభుత్వానికి తోడ్పడేలా కొన్ని సిఫార్సులను 10 రోజుల్లో ప్రధానికి సమర్పిస్తామన్నారు. -
అంబానీ అకౌంట్ హ్యక్ చేసిన హైదరాబాదీ అమ్మాయి!
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఆదాయపు పన్ను రిటర్న్ ఈ-ఫైలింగ్ అకౌంట్ ను హైదరాబాద్ కు చెందిన యువతి హ్యక్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చార్టెండ్ అకౌంటెన్సీ అర్టికల్ షిప్ చేస్తున్న 21 ఏళ్ల విద్యార్థినిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబానీ ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే హ్యకింగ్ కు హ్యకింగ్ కు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లోని మనోజ్ దాగా అండ్ కంపెనీలో ఆర్టికల్ షిప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత సెప్టెంబర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద సంబంధిత సెక్షన్ల తో కేసు నమోదు చేసినట్టు సమాచారం. గత కొంతకాలంగా ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. అనిల్ ధిరూబాయి అంబానీ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అకౌంట్ ను హ్యక్ చేసిన తర్వాత.. ఐటీ వెబ్ సైట్ ను సందర్శించి ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలను, పాన్ కార్డ్ నంబర్ ను సేకరించడమే కాకుండా, రెండుసార్లు పాస్ వర్డ్ ను మార్చినట్టు విచారణలో వెల్లడైంది. గత 54 ఏళ్లుగా అంబానీ ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న ఓ చార్టెడ్ అకౌంట్ కంపెనీ నిర్వాహకులు ఈమెయిల్ ద్వారా ఐటీ డిపార్ట్ మెంట్ కు జూన్ 26, జూలై 12 తేదిన అకౌంట్ ను వివారాలను మార్చినట్టు ఫిర్యాదు చేశారు. అయినా ఇంకా అనుమానాలు తలెత్తడంతో జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) కు అడాగ్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసు అధికారి హిమాంశు రాయ్.. సైబర్ సెల్ ఇన్స్ పెక్టర్ ముకుంద్ పవార్ కు విచారణ చేయాలని ఆదేశించారు. విచారణ ప్రారంభించిన సైబర్ పోలీసులు.. హైదరాబాద్ లోని మనోజ్ దాగా అండ్ కంపెనీ నుంచి హ్యకింగ్ జరిగిందని ధృవీకరించారు. దాంతో ఆసంస్థలో ఆర్టికల్ షిప్ చేస్తున్న విద్యార్థినిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత హ్యకింగ్ కు సంబంధించిన కంప్యూటర్ ను సీజ్ చేశారు. సైబర్ నేరానికి పాల్పడినట్టు ప్రాధమిక, సాంకేతిక సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని.. ఈ కేసు నాన్ బెయిలబుల్ పరిధిలోకి వస్తుందని సైబర్ ఇన్స్ పెక్టర్ పవార్ తెలిపారు.