హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ ఆదాయ పన్ను ఖాతాను హైదరాబాదీ సీఏ విద్యార్థిని హ్యాకింగ్ చేయడంపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) విచారణ జరపనుంది. ఆమెకు దీనిపై నోటీసు ఇవ్వనున్నట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ సుబోధ్ కుమార్ అగ్రవాల్ తెలిపారు. విద్యార్థిని ఆర్టికల్‌షిప్ చేస్తున్న సీఏ సంస్థ మనోజ్ దాగా అండ్ కంపెనీపై చర్యలేమైనా ఉంటాయా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. అనిల్ ఐటీ అకౌంటును హ్యాక్ చేసి ఆయన ఆదాయాలు, చెల్లిస్తున్న పన్నులు తదితర వివరాలను తస్కరించారని విద్యార్థిని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
సర్కారుకు సిఫార్సులు చేస్తాం: మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ప్రభుత్వానికి తోడ్పడేలా కొన్ని సిఫార్సులను 10 రోజుల్లో ప్రధానికి సమర్పిస్తామన్నారు.
సీఏ విద్యార్థిని హ్యాకింగ్‌పై ఐసీఏఐ విచారణ
Published Sun, Sep 15 2013 1:34 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
Advertisement