పది జిల్లాల తెలంగాణాకే కేబినెట్ ఆమోదం
-
10 జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లుకు...
-
కేబినెట్ ఆమోద ముద్ర వేసింది
-
ఆర్టికల్ 3కింద బిల్లు ఆమోదం పొందింది
-
కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లు రాష్ట్రపతికి వెళ్తుంది
-
10ఏళ్ల ఉమ్మడి రాజధానిగా జీ హెచ్‌ఎంసీ
-
371(డి) రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతుంది
-
ఉన్నత విద్య అడ్మిషన్లలో ఇప్పుడున్న విధానమే..
-
10ఏళ్లపాటు కొనసాగుతుంది
-
పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా
-
పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే
-
గవర్నర్ చేతిలో జీ హెచ్‌ఎంసీ శాంతిభద్రతలు
రాష్ట్ర విభజన అంశంపై మూడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన కేంద్ర కేబినెట్ సమావేశం రాత్రి 8 గంటలకు ముగిసింది. కేంద్ర కేబినెట్ సమావేశంపై హోమంత్రి సుశీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడారు. సుధీర్ఘంగా సాగిన సమావేశంలో కేంద్రం కేబినెట్ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
షిండే మాట్లల్లో..
''కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్రవిభజనకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ కేబినెట్ నిర్ణయం మేరకు 10 జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలిపింది. జీవోఎం, 18 వేల ఈమెయిల్స్, అన్ని పార్టీలను ఆహ్వానించాం. అన్ని మంత్రవర్గ కార్యదర్శిలతో మేం చర్చించాం. ముఖ్యమంత్రి, డిప్యూటి సీఎం, రాష్ట్ర మంత్రులతో మంత్రులతో భేటి నిర్వహించాం. అన్ని అంశాలను చర్చించాకే జీవోఎం సిఫారసుల మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును జీవోఎం సిఫారసు మేరకు కేంద్రం ఆమోదించింది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లు ఉంటుందని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉమ్మడి రాజధాని ఉంటుంది.
ప్రజల భద్రతకు తెలంగాణ గవర్నర్ కు ప్రత్యేక అధికారాలుంటాయి. ఆర్టికల్ 3 కింద బిల్లు ఆమోదం పొందుతుంది. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ హోదా కల్పిస్తాం. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యతను కేంద్రం స్వీకరిస్తుంది. 371 డి రెండు రాష్ట్రాలకు వర్తిస్తుంది. రెండు రాష్రాల అభివృధ్దికి కేంద్ర సహాయం అందిస్తుంది'' అని షిండే కిక్కిరిసిన మీడియా సమావేశంలో అన్నారు.