హైదరాబాద్: భారత పత్తి సంస్థ(సీసీఐ) బయ్యర్ల నివాసాలపై దేశవ్యాప్తంగా సీబీఐ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. రైతులకు కనీస మద్దతుధర చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బయ్యర్ల అక్రమాల నిగ్గుతేల్చాలన్న కోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది.
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, గుంటూరు, ముంబై, నాగపూర్ లో 27 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. 3 కేజీల బంగారం, 30 కేజీల వెండి, పలు కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పత్తికొనుగోలుదారులతో పాటు అధికారులను సీబీఐ ప్రశ్నిస్తోంది.
3 కేజీల బంగారం, 30 కేజీల వెండి స్వాధీనం
Published Thu, Feb 12 2015 9:30 PM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM
Advertisement
Advertisement