ఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి కేంద్ర కేబినెట్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఉదయం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ప్రధాని మన్మోహన్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేంద్ర కేబినెట్ గురువారం సాయంత్రం భేటీ అయ్యింది. ఈ భేటీకి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, పి. చిదంబరం, ఆంటోనీ, జైరాం రమేష్, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి, జైపాల్‌రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావు, కిశోర్‌చంద్రదేవ్‌లు హాజరైయ్యారు.
ఈ సమావేశంలో టేబుల్ ఐటమ్ గా టీ.బిల్లు కేబినెట్ ముందుకు రానున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు -2013కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జీవోఎం నివేదిక, విభజనపై ముసాయిదా బిల్లును కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలుపుతారని అధికార వర్గాలతో పాటు కాంగ్రెస్ ఉన్నతస్థాయి వర్గాలూ గట్టిగా చెప్తున్నాయి.