సీబీఐకి ఆర్థిక స్వయం ప్రతిపత్తి
న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెష్టిగేషన్ (సీబీఐ)కు ఎట్టకేలకు కేంద్రం ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించింది. దీంతో సీబీఐకి మరిన్ని అధికారాలు లభించినట్లు అయ్యింది. కేంద్రం తాజా నిర్ణయంతో సీబీఐ డైరెక్టర్కు కార్యదర్శి స్థాయి అధికారాలు ఉంటాయి. ఈ సందర్భంగా సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా మాట్లాడుతూ క్రీడల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా సుప్రీం కోర్టు ఆగ్రహం నేపథ్యంలో సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.