అటు దణ్ణం పెట్టుకుంటుంటే... ఇటు ...
ఏలూరు : దేవాలయం ముందు నిలబడి దేవుడికి నమస్కారం చేసుకుంటున్న భక్తురాలి మెడలో గొలుసును దుండగులు తెంచుకెళ్లారు. ఈ ఘటన శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. స్థానిక శంకరమఠం వద్ద సాయిబాబా గుడి ముందు మహిళ దండం పెట్టుకుంటుంది. అయితే అప్పటికే అక్కడ బైక్పై ఓ యువకుడు వేచి ఉండగా మరో యువకుడు ఆగమేఘాల మీద దూసుకొచ్చి... దండంపెట్టుకుంటున్న మహిళ మెడలోని బంగారపు గొలుసు తెంపి.. అంతే వేగంతో బైక్పై అక్కడి నుంచి పరారైయ్యాడు.
గొలుసు లాగే సమయంలో మహిళ కిందపడటంతో... సదరు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ విషయం గమనించిన స్థానికులు చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్లు స్థానికుల చేతికి చిక్కలేదు. బాధితురాలని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.