అధికారులూ.. యాపిల్ ఉత్పత్తులు కొనద్దు!
ప్రజాధనంతో యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయద్దంటూ చైనా తమ ప్రభుత్వాధికారులను ఆదేశించింది. భద్రతాపరమైన కారణాల వల్లే ఈ నిషేధం విధించినట్లు చెప్పింది. ఐ ప్యాడ్లు, మాక్బుక్ల లాంటి ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోళ్ల జాబితా నుంచి జూలై నెలలోనే తొలగించారు. జూన్ వరకు వీటిని కొనుగోలు చేసేవారు. ఈ నిషేధంతో చైనా మార్కెట్లో యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలపై గణనీయంగా ప్రభావం పడనుంది.
అమెరికాకు చెందిన సిమాంటిక్ కార్పొరేషన్, రష్యాకు చెందిన కాస్పర్స్కీ ల్యాబ్ల నుంచి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయొద్దని చైనా ఇటీవలే ప్రభుత్వ శాఖలకు తెలిపింది. అలాగే, ప్రభుత్వ కొనుగోళ్ల నుంచి మైక్రోసాఫ్ట్ విండోస్ 8ను ఈ సంవత్సరం మే నెలలో మినహాయించారు. ఈ జాబితాలో స్మార్ట్ఫోన్లు లేకపోవడంతో ఐఫోన్ మాత్రం నిషేధం నుంచి తప్పించుకుంది.