ప్రమాదం తప్పించారని.. కోట్ల రూపాయల బహుమానం | Chinese airliner rewards crew, passengers for taming arsonist | Sakshi
Sakshi News home page

ప్రమాదం తప్పించారని.. కోట్ల రూపాయల బహుమానం

Published Wed, Aug 5 2015 6:34 PM | Last Updated on Mon, Aug 13 2018 3:30 PM

ప్రమాదం తప్పించారని.. కోట్ల రూపాయల బహుమానం - Sakshi

ప్రమాదం తప్పించారని.. కోట్ల రూపాయల బహుమానం

ఓ చేత్తో కత్తి పట్టుకుని.. విమానానికి నిప్పు పెట్టేస్తానంటూ ఎవరైనా బెదిరిస్తుంటే, అదే విమానంలో ప్రయాణిస్తున్న మీరు ఏం చేస్తారు? దేవుడా.. మా విమానం గాల్లో పేలిపోకుండా చూడు అంటూ ప్రార్థిస్తారా? అలా కాకుండా జాగ్రత్తగా సిబ్బందితో కలిసి ఆ ఉగ్రవాదిని పట్టుకోడానికి ప్రయత్నిస్తారా? చైనాలో ఓ విమానాన్ని ఇలా పేలిపోకుండా కాపాడినందుకు తొమ్మిది మంది సిబ్బందితో పాటు ఇద్దరు ప్రయాణికులకు సదరు విమానయాన సంస్థ భారీగా బహుమానాలు ప్రకటించింది.

షెంజెన్ ఎయిర్లైన్స్ సంస్థ మొత్తం 9 మంది సిబ్బంది ఒక్కొక్కరికి రూ. 2.55 కోట్లు, ఇద్దరు ప్రయాణికులకు రూ. 16 లక్షల వంతున నగదు బహుమతులు ప్రకటించింది. ఒక సీటుకు నిప్పు పెట్టిన తర్వాత ఆ దుండగుడిని సిబ్బంది, ప్రయాణికులు పట్టుకున్నారు. ఆ సమయానికి విమానంలో వందమందికి పైగా ప్రయాణికులున్నారు. ముందుగా ఓ ఫ్లైట్ అటెండెంటు పెట్రోలు వాసనను గుర్తించారు. రెండు సీట్ల మీద పెట్రోలు పడినట్లు కూడా గుర్తించి, వెంటనే సిబ్బందికి చెప్పారు. వెంటనే సిబ్బంది అక్కడకు వస్తుండటంతో ఓ వ్యక్తి కత్తి చేత్తో పట్టుకుని, ఆ సీట్ల మీద నిప్పంటించాడు.

సిబ్బంది వెంటనే మంటలు ఆర్పేసి, అతడితో పోరాడారు. ఇద్దరు ప్రయాణికులు కూడా దిళ్లు, బ్యాగులతో అతడిని పట్టుకోడానికి యథాశక్తి తోడ్పడ్డారు. దాంతో ఇప్పుడా సిబ్బందికి, ప్రయాణికులకు కూడా విమానయాన సంస్థ భారీగా నగదు బహుమతులు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement