ఆ పక్షి హెయిర్ స్టైల్ అచ్చూ ట్రంప్ లానే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోకి రిపబ్లికన్ పార్టీ తరఫున డోనాల్డ్ ట్రంప్ దిగగానే ఆయన పేరుతో శాండ్ విచ్ లు, టాయిలెట్ పేపర్లు, మరుగుదొడ్లు వెలిశాయి. ప్రచార సమయంలో ట్రంప్ జుత్తుపై ప్రత్యేక చర్చ కూడా జరిగింది. తాజాగా చైనాకు చెందిన ఓ పక్షి జుత్తు ట్రంప్ జుత్తును పోలి ఉందనే ప్రచారం జరుగతోంది. ఆ పక్షికి సంబంధించిన ఫోటోలు కూడా ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి.
బంగారు వర్ణంలో ఉన్న పక్షి జుత్తు అచ్చూ ట్రంప్ జుత్తులానే ఉందని నెటిజన్లు అంటున్నారు. దీంతో చైనాలోని హంగ్ జోవు సఫారీ పార్కులో ఉన్న ఈ పక్షి రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయింది. దానికి ట్రంప్ బర్డ్ అని పేరు కూడా పెట్టేశారు. ఈ పక్షిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు పార్కుకు క్యూ కడుతున్నారు.