ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆంక్షలు | Choke terror funds through targeted sanctions: Prime Minister Narendra Modi | Sakshi

ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆంక్షలు

Nov 19 2015 3:04 AM | Updated on Aug 24 2018 2:20 PM

ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆంక్షలు - Sakshi

ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆంక్షలు

ఉగ్రవాదులకు నిధులు అక్రమంగా చేరకుండా లక్షిత ఆర్థిక ఆంక్షలు అమలు చేయటం అత్యవసరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

 న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు అక్రమంగా చేరకుండా  లక్షిత ఆర్థిక ఆంక్షలు అమలు చేయటం అత్యవసరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. టైస్టులకు అందిన ఆర్థిక సహకారం, అక్రమ సొమ్ము వల్ల ప్రపంచానికి జరుగుతున్న నష్టానికి పారిస్ మారణహోమం ఓ నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు వాహనాల దొంగతనం మొదలుకుని తీవ్రమైన క్రిమినల్ నేరాల ద్వారా నిధులు అందుతున్నాయన్నారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందించే ఆర్థిక మూలాలను నియంత్రిస్తే వారి దాడులకు అడ్డుకట్ట వేసినట్లేనన్నారు. బుధవారమిక్కడ  6వ గ్లోబల్ ఫోకల్ పాయింట్ కాన్ఫరెన్స్, సీబీఐ, స్టేట్ యాంటీ కరప్షన్, విజిలెన్స్ బ్యూరో 21వ కాన్ఫరెన్స్‌లో మోదీ ప్రసంగించారు.  
 
 బహుళత్వమే మా బలం: మోదీ
 బహుళత్వం సహా భారత్‌కు అద్భుతమైన సామాజిక సామర్ధ్యాలు అనేకం ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్డీయే పాలనలో దేశంలో నెలకొన్న అసహనంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై మోదీ మరోసారి స్పందించారు.  గతవారం లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో మాట్లాడుతూ.. భారత దేశ బలం వైవిధ్యత, బహుళత్వమేనని, అదే భారత్ ప్రత్యేకత అని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ప్రఖ్యాత ‘ఎకనమిస్ట్’ పత్రికలో రాసిన వ్యాసంలో అదే అంశాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు. మోదీ వ్యాసంలోని కొన్ని ముఖ్యాంశాలను ఆ పత్రిక విలేకరి బుధవారం ట్వీట్ చేశారు.  
 
 నా ప్రమాణానికి  రండి: నితీశ్
 పట్నా: ఈ నెల 20న బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నితీశ్ కుమార్, ఆ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ఫోన్ చేసి ఆహ్వానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement