
జీఎస్టీ అమలు రెండునెలలు వాయిదా!
కేంద్ర ఆర్థికశాఖను కోరిన పౌరవిమానాయానశాఖ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలును రెండు నెలలపాటు వాయిదా వేయాలని పౌరవిమానాయానశాఖ కోరుతోంది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను వ్యవస్థ ఉండేందుకు జూలై 1 నుంచి కేంద్రం జీఎస్టీని అమలోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, జూలై 1లోగా తమ వ్యవస్థను పూర్తిగా మార్చుకొని జీఎస్టీని అమలుచేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని, కాబట్టి సెప్టెంబర్ 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకురావాలని కోరుతూ కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖకు పౌరవిమానాయానశాఖ లేఖ రాసింది. ఇప్పటికిప్పుడు విమానాయాన సంస్థలు జీఎస్టీని అమలుచేయలేవు కాబట్టి తమకు మినహాయింపునివ్వాలని కోరుతున్నాయని ఆ శాఖ పేర్కొంది.