స్కూల్‌కు తుపాకీ తీసుకెళ్లి.. | Class 11 boy shoots classmate at Ghaziabad school to avenge fight with brother | Sakshi
Sakshi News home page

స్కూల్‌కు తుపాకీ తీసుకెళ్లి..

Published Thu, Feb 9 2017 8:57 AM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

స్కూల్‌కు తుపాకీ తీసుకెళ్లి..

స్కూల్‌కు తుపాకీ తీసుకెళ్లి..

ఘజియాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ ఇంటర్ విద్యార్థి కాలేజీకి తుపాకీ తీసుకెళ్లి కలకలం సృష్టించాడు. తన తమ్ముడితో గొడవపడ్డ మరో విద్యార్థిని తుపాకీతో కాల్చాడు. విద్యార్థి నడుములోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. స్కూల్‌ సిబ్బంది వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని, ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు.

గోవింద్‌పురంలోని డెహ్రాడూన్ పబ్లిక్‌ స్కూల్లో ఇద్దరు విద్యార్థులు గొడవపడ్డారు. మరుసటి రోజు ఓ విద్యార్థి అన్న ఇంట్లో నుంచి నాటు తుపాకీ తీసుకొని క్యాంపస్కు వెళ్లాడు. తన సోదరుడిపై దాడిచేసిన విద్యార్థిపై లంచ్‌ టైమ్‌లో కాల్పులు జరిపాడు. నిందితుడు, అతని ముగ్గురు స్నేహితులు కలసి బెల్ట్‌లతో తన కొడుకును చితకబాది, తర్వాత కాల్చాడని బాధితుడి తండ్రి ఆరోపించాడు. టీచర్లు, ఇతర సిబ్బంది వచ్చి అడ్డుకుని, తన కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లి కాపాడారని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. తుపాకీని స్వాధీనం చేసుకుని నిందితుడి తల్లిదండ్రులను విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement