ఏడు రకాల ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ : లోక్సభలో చర్చ సందర్భంగా లలిత్ మోదీ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఏడు రకాల ప్రశ్నలు సంధించింది. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ....లేవనెత్తిన ప్రశ్నలు ఇవే...
*లలిత్ మోదీకి సంబంధించిన పత్రాలను ఎందుకు రహస్యంగా ఉంచారు?
*మోదీకి తాత్కాలిక పద్ధతిలో అనుమతి పత్రాలు ఎందుకు ఇవ్వలేదు?
*హైకోర్టు ఆదేశాలను ఎందుకు సవాల్ చేయలేదు?
*లలిత్ మోదీకి సహాయం చేయాలన్న నిర్ణయం ఎవరు తీసుకున్నారు? దీనికి ఎవరు ఆమోదం తెలిపారు?
*బ్రిటన్ అనుమతి ఇస్తున్న సమయంలో భారత్ అభ్యంతరం తేలిపిందా? లేదా?
*మోదీకి నివాస పత్రాన్ని ఎలా మంజూరు చేశారు?
* ట్రావెల్ డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాత మోదీ ఎక్కడకు వెళ్లారు?
*పోర్చుగల్ వెళ్లారు, వియన్నా వెళ్లారు, రిసార్టుల్లో సేద తీరారు?
*మానవతా దృక్పథంతో ఇచ్చిన అనుమతి ఇదేనా?
*మోదీకి వెనక్కి తీసుకు రావడంలో ప్రభుత్వం ఎందుకు విఫలం అయింది?
*లలిత్ మోదీ కుటుంబంతో ఉన్న సంబంధాలు ఏంటి?