అక్షయ్ ఖన్నాను 50 లక్షలు మోసగించిన కేసులో ఇద్దరు అరెస్ట్! | Couple quizzed over Akshaye Khanna's complaint of cheating | Sakshi
Sakshi News home page

అక్షయ్ ఖన్నాను 50 లక్షలు మోసగించిన కేసులో ఇద్దరు అరెస్ట్!

Published Mon, Oct 21 2013 9:50 PM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM

అక్షయ్ ఖన్నాను 50 లక్షలు మోసగించిన కేసులో ఇద్దరు అరెస్ట్!

అక్షయ్ ఖన్నాను 50 లక్షలు మోసగించిన కేసులో ఇద్దరు అరెస్ట్!

50 లక్షల రూపాయల చీటింగ్ చేశారని బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా దాఖలు చేసిన ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు ఓ ప్రైవేట్ కంపెనీ అధినేత, అతని భార్యను పోలీసులు విచారించారు. కమాడిటీ మార్కెట్ పెట్టుబడి పెడితే 45 రోజుల్లో రెండింతలు ఇస్తామని చెప్పి తన వద్ద 50 లక్షల రూపాయలు తీసుకుని మోసానికి పాల్పడ్డారని అక్షయ్ ఖన్నా ఫిర్యాదు చేశారని పోలీసుల అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంటెక్ ఇమేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని సత్యబ్రత చక్రవర్తి, అతని భార్యను సోనాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 
 
అయితే వారు కమాడిటి మార్కెట్ లో పెట్టుబడిపెట్టారని.. అయితే లాభాలు వచ్చాయా లేక నష్ణపోయారా అనే విషయాన్ని వెల్లడించడం లేదని పోలీసులు ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. వారి వద్దనుంచి సొమ్మును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అక్టోబర్ 2010 అక్టోబర్ నెలలో అక్షయ్ ఖన్నా పెట్టుబడి పెట్టారని.. గత మూడు సంవత్సరాలుగా సొమ్ము చెల్పించమంటే తప్పించుకుతిరుగుతుండటంతో ముంబైలోని మలబార్ హిల్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement