అమెజాన్‌లో పిడకల అమ్మకం | Cow dung cakes selling hot on Amazon, Shopclues and eBay | Sakshi
Sakshi News home page

అమెజాన్‌లో పిడకల అమ్మకం

Published Mon, Dec 28 2015 4:28 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

అమెజాన్‌లో పిడకల అమ్మకం

అమెజాన్‌లో పిడకల అమ్మకం

ఆన్‌లైన్ పోర్టల్స్ అపార్ట్‌మెంట్ల నుంచి గుండు సూది దాకా దేన్నైనా అమ్మేస్తుంటాయి. ఈ కోవలోకి కొత్తగా వచ్చి చేరిందో వస్తువు. అదేమిటో కాదండోయ్.. ఆవు పేడ. నిజమే.. ఆవుపేడతో చేసిన పిడకలకు ఇప్పు డు ఆన్‌లైన్‌లో యమ డిమాండ్. అమెజాన్, షాప్‌క్లూస్ వంటి పోర్టల్స్‌లో ఇప్పుడీ పిడక లు అందుబాటులో ఉన్నాయి. హైందవ ఆచారాల్లో శుభ కార్యానికైనా, కర్మలకైనా ఆవుపేడ తప్పనిసరి. విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈ మధ్య ఖర్చుకు వెనుకాడకుండా అన్ని పనులు సంప్రదాయ పద్ధతుల్లో చేస్తున్నారు. తమ ఆచార వ్యవహారాలు కాపాడుకుంటున్నారు.

ఏదో కార్యం పడింది.. మహానగరాల్లో అదెక్కడ దొరుకుతుందో తెలి యదు, పూజాద్రవ్యాలను అమ్మే షాపులకు వెళ్తే దొరుకుతుందనే గ్యారంటీ లేదు. అలాం టి షాపులు కూడా ఎక్కడున్నాయో వెతికి పట్టుకోవాలి. అంత ఓపిక లేని నెటిజన్లు ఇప్పుడు ఎంచక్కా మొబైల్‌లో ఆర్డరిచ్చే స్తున్నారు. 99 రూపాయలు మొదలు కొని 400 పైచిలుకు (ప్యాక్‌లో పిడకల సంఖ్యను బట్టి) ధరలకు ఆవుపేడ పిడకలు అమెజాన్‌లో లభిస్తున్నాయి. ఇదేదో ఆషా మాషీ వ్యవహారం కాదండోయ్.

ఢిల్లీకి చెంది న ఆసియా క్రాఫ్ట్స్ యజమాని ప్రీతి కర్లాకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. ఆసియా క్రాఫ్ట్స్ మతపరమైన సామగ్రిని అమ్ముతుం ది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ప్రీతి పూజాదికాల్లో ఇప్పుడేవి వాడు తున్నారో తెలుసుకోవడానికి భక్తి చానళ్లను చూస్తుంది. ఒకరోజు ఓ స్వామివారు ఆవుపేడ పిడకలను కాల్చాలని, పేడతో వాకిలి అలకాలని చెప్పడంతో... ప్రీతికి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది.

ఢిల్లీ శివార్లలోని గ్రామాల నుంచి ఆవుపేడతో చేసిన పిడకలను సేకరించి ఆన్‌లైన్‌లో అమ్మడం మొదలు పెట్టింది. అయితే ఒక్కొక్కరు ఒక్కో సైజులో, మం దంతో చేస్తుండటంతో ప్యాకింగ్ కష్టమై పో యేది. దీంతో ఓ ఊరిలో సొంతంగా పిడకల తయారీని చేపట్టింది. 8 పిడకల ప్యాక్‌ను ఆసియా క్రాఫ్ట్స్ రూ.419కు అమ్ముతోంది. నెలకు 3,000 పైచిలుకు ప్యాకెట్ల ఆవుపేడ పిడకలను ఈ సంస్థ అమ్ముతోంది. విదేశాల్లో ని హిందూ ఆలయాల నుంచి కూడా వీరికి ఆర్డర్లు వస్తున్నాయి.       
- సెంట్రల్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement