Cow manure
-
ఆవు పేడతో మంచినీళ్లు.. ఎలా తయారు చేస్తారో తెలుసా?
భూమి ఉపరితలంపై 70శాతానిపైగా నీళ్లే. అయినా తాగేనీటికి కరువే. కానీ సముద్రాల ఉప్పునీటిని ఆవు పేడ సాయంతో మంచినీటిగా మార్చే సరికొత్త టెక్నాలజీకి శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. ఎండను ఆధారంగా చేసుకుని.. పెద్దగా ఖర్చేమీ లేకుండానే.. మంచినీటిని తయారు చేసుకోవచ్చని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కష్టాలు తీర్చే ఈ పరిశోధన వివరాలేమిటో తెలుసుకుందామా.. నీటి కరువులో 142 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కలిపి సుమారు 142 కోట్ల మంది నీటి కరువుతో బాధపడుతున్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనా. పక్కనే సముద్రాలు ఉన్నా.. తాగేనీటి కోసం ఇబ్బందిపడే ప్రాంతాలు ఎన్నో. అలాంటి చోట్ల ఉప్పునీటిని మంచినీటిగా మార్చుకుని వినియోగించాల్సిన పరిస్థితి. దీనికోసం భారీగా వ్యయం అవుతుంది. అమెరికాలోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ సమస్యకు పరిష్కారం చూపడంపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఆవుపేడతోపాటు మరికొన్ని ఇతర పదార్థాలతో నీటిని శుద్ధిచేసే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. చదవండి: వయసు వందకు పైనే.. ‘ఔరా’ అనిపిస్తున్న బామ్మలు సూర్యరశ్మితో నీటిని వేడి చేసి.. శాస్త్రవేత్తలు ఫోమ్‌ను సముద్రపు ఉప్పునీటిపై ఉంచి ఎండతగిలేలా ఏర్పాటు చేశారు. నీటిపై తేలుతున్న ఫోమ్ సూర్యరశి్మని శోషించుకుని వేడెక్కడం మొదలుపెట్టింది. ఆ వేడి సూక్ష్మగొట్టాల ద్వారా దిగువన నీటికి చేరింది. అక్కడ నీరు ఆవిరై.. దానిలోని ఉప్పు, ఇతర లవణాలు విడిపోయాయి. స్వచ్ఛమైన నీరు, ఆవిరి సూక్ష్మగొట్టాల ద్వారా ఫోమ్ పైభాగానికి వచ్చాయి. శాస్త్రవేత్తలు పలు పరికరాలను ఫోమ్‌కు అనుసంధానం చేసి ఆ నీటిని సేకరించారు. దానిలో లవణాలు, ఇతర అంశాలను పరీక్షించి.. తాగడానికి పూర్తి అనుగుణంగా ఉన్నట్టు గుర్తించారు. చదవండి: ఆవు మాత్రమే అలా చేయగలదు: అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు ఫోమ్‌లా రూపొందించి.. శాస్త్రవేత్తలు ఆవు పేడతోపాటు ఎండిపోయిన ఆకులు, పీతలు, నత్తల షెల్స్‌ను కలిపి.. తీవ్ర ఒత్తిడి వద్ద 1,700 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వరకు వేడిచేశారు. దీనితో ఈ పదార్థాల్లోని బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మజీవులు నశించి.. పొడి కర్బన పదార్థం ఏర్పడింది. ఈ కర్బన పదార్థానికి అత్యంత చిక్కని నలుపు రంగును ఇచ్చే ‘కెటిల్ ఫిష్’ఇంకును కలిపారు. ఈ మిశ్రమంతో ఫోమ్ (గుల్లగా ఉండే డస్టర్ వంటి అతితేలికైన పదార్థం)ను తయారుచేశారు. అత్యంత సూక్ష్మమైన గొట్టాల వంటి నిర్మాణంతో ఉండే ఈ ఫోమ్.. నీటిని సమర్థవంతంగా పీల్చుకోవడంతోపాటు ఉపరితలంపై తేలుతూ ఉంటుంది. ఉప్పునీటి శుద్ధికి యంత్రాలున్నా.. ► ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియను డీసాలినేషన్ అంటారు. ఇందుకోసం ఇప్పటికే పలు విధానాలు ఉన్నాయి. కానీ అందులో వాడే ఫిల్టర్ల ధర ఎక్కువ. చాలా విద్యుత్ అవసరమవుతుంది. దీనివల్ల నీటి శుద్ధికి చాలా ఎక్కువ ఖర్చవుతుంది. పర్యావరణానికి కూడా నష్టం కలిగిస్తుంది. అందుకే గల్ఫ్, ఇతర ధనిక దేశాలు మినహా ఎక్కడా ఈ పరికరాలను వినియోగించడం లేదు ► తాజాగా నార్త్ఈస్టర్న్ వర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన ఫోమ్ తయారీలో పూర్తిగా వ్యర్థాలనే వాడటం, విద్యుత్ అవసరం లేకపోవడంతో.. ఖర్చు తక్కువ. ఈ విధానాన్ని అంతటా వినియోగించవచ్చని, కోట్లాది మంది కష్టాలు తీరుతాయని శాస్త్రవేత్త యిజెంగ్ తెలిపారు. ► ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బావులు, చెరువుల్లో నీళ్లు ఉన్నా నేరుగా తాగలేం. వాటిలో లవణాల శాతం ఎక్కువగా ఉండటంతోపాటు బ్యాక్టీరియా, వైరస్లు, ఇతర సూక్ష్మజీవులతో కలుíÙతం అయి ఉండే అవకాశాలు ఎక్కువ. అలాంటిచోట్ల కూడా ఈ కొత్త విధానంలో నీటిని శుద్ధి చేసుకుని తాగవచ్చని యిజెంగ్ పేర్కొన్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఆవు పేడతో వ్యాపారమా? అని నవ్వి ఊరుకున్నాను.. కానీ, ఇప్పుడు
పాడి లేని ఇల్లు, పేడ లేని చేను లేదు...అనేది పాత సామెత. ‘పేడ ఉన్న చోట పేమెంట్స్ ఉండును’ అనేది సరికొత్త సామెత. దీని లోతు తెలుసుకోవాలంటే ఛత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాకు వెళ్లాల్సిందే. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ జిల్లా ఇప్పుడు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది. చౌరియా, అంబగోర్, తహ్‌షిల్, గుమ్కా, సింఘాల, తెందెసాల్... ఇలా రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని ఎన్నో గ్రామాల్లో ఆవు పేడ అనేది ఆదాయ వనరుగా మారింది. మహిళలు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి విగ్రహాలు, మొబైల్ ఫోన్‌స్టాండ్లు, నర్సరీ పాట్స్... ఒక్కటనేమిటీ తమ సృజనాత్మకతకు పదును పెట్టి రకరకాల ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. ఒకప్పుడు వీటి మార్కెట్ జిల్లా సరిహద్దులకే పరిమితం. ఇప్పుడు మాత్రం ఇ–కామర్స్ వేదికల పుణ్యమా అని అంతర్జాతీయస్థాయికి చేరింది. రోజురోజుకు ఆన్లైన్ మార్కెట్ ఊపందుకోవడం విశేషం. ‘మా పొరుగింటి ఆవిడ పేడ వ్యాపారం గురించి చెప్పగానే నవ్వి ఊరుకున్నాను. అలాంటి నేను ఇప్పుడు ఆవు పేడతో రకరకాల వస్తువులు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నాను’ అంటుంది అంబగోర్ గ్రామానికి చెందిన సబిత. ఆవు పేడ వ్యాపారాన్ని అధ్యయనం చేయడానికి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్... మొదలైన రాష్ట్రాల నుంచి మహిళలు బృందాలుగా వస్తుంటారు. ‘ఈ వ్యాపారం రాబోయే కాలంలోగ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేస్తుంది. సేంద్రియ వ్యవసాయానికి ఊతం ఇస్తుంది’ అని చెప్పారు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక ఉన్నతాధికారి. ఉత్తరప్రదేశ్‌లో అపర్ణ అనే లాయర్ తన వృత్తికి స్వప్తి పలికి పేడ వ్యాపారంలోకి దిగారు. గౌతమబుద్ధనగర్ జిల్లాలో పది ఎకరాల విస్తీర్ణంలో గోశాల నిర్వహిస్తున్నారు. ఇందులో 120 వరకు ఆవులు ఉన్నాయి. ఈ గోశాల నుంచి వచ్చే పేడతో రకరకాల వస్తువులు తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ‘ఇది వ్యాపారమే కాదు. ఆవుపేడ ద్వారా అదనపు ఆదాయాన్ని అర్జించవచ్చు...అనే సందేశం ఇవ్వడం కూడా’ అంటున్న అపర్ణ వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళలకు ‘ఆవుపేడతో ఎలాంటి వస్తువులు తయారుచేయవచ్చు?’ ‘ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?’ ‘మార్కెట్ ఎలా చేయాలి?’ ‘పేడ నుంచి వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు’... మొదలైన విషయాల్లో సలహాలు ఇస్తుంటారు. పంజాబ్‌లోని బులందపూర్‌లాంటి ఎన్నో గ్రామాల్లో ఆవుపేడను ఊరవతల వేసే అలవాటు ఉండేది. ఇప్పుడు ఆ అలవాటు మానుకొని పేడను జాగ్రత్త చేస్తున్నారు. పదిమంది మహిళలు ఒక బృందంగా ఏర్పడి పిడకలతో పాటు రకరకాల వస్తువులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలో ఎన్నో మహిళాబృందాలు పయనిస్తున్నాయి. -
కలబంద ద్రావణంతో పంటలకు మేలు
ప్రకృతి నేర్పిన పాఠాలను ఆకళింపు చేసుకొని ప్రకృతి/సేంద్రియ సేద్యాన్ని ఔపోశన పట్టి, నేర్చుకున్న విషయాలను పదుగురు రైతులకు తెలియజెపుతూ చక్కని దిగుబడులు రాబడుతున్నారు మహిళా రైతు అప్పన్నగారి యశోదమ్మ. కలబంద వంటి అనేక మొక్కల ద్రావణాలతో ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా చిన్నమండెం మండలం చిన్ననర్సుపల్లె గ్రామానికి చెందిన యశోదమ్మ స్వతహాగా రైతు. పెట్టుబడిలేని ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విభాగంలో క్లస్టర్ రిసోర్సు పర్సన్‌గా పనిచేస్తున్నారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, పత్తి, టమాటా, వంగ, బెండ, మిరప, సొర, బీర తదితర కూరగాయ పంటలు, మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్ల తోటలను ఆశించే పలు రకాల పురుగులు, తెగుళ్ల నివారణకు కలబంద ద్రావణం చక్కటి పరిష్కార మార్గమని ఆమె అనుభవపూర్వకంగా చెబుతున్నారు. కలబంద ద్రావణం తయారీ ఇలా.. 2 కిలోల కలబంద ఆకులను దంచి పెట్టుకోవాలి. అలాగే, పావు కిలో కుంకుడు కాయలను పొడి చేయాలి. 5 లీటర్ల ఆవు మూత్రాన్ని, 5 కిలోల ఆవు పేడను సేకరించాలి. వీటిలో ఆవుపేడ తప్ప మిగతా అన్నిటినీ 200 లీటర్ల నీరుపట్టే డ్రమ్ములో వేసి.. తర్వాత ఎంతపడుతుందో అంత నీరు పోయాలి. ఆవు పేడను ఒక పలుచటి గొనె సంచిలో మూటకట్టి నీళ్ల డ్రమ్ములో వేలాడదీయాలి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద కర్రతో కలియతిప్పాలి. వారం రోజులకు బాగా మురిగితే కలబంద ద్రావణం తయారవుతుంది. ద్రావణం పిచికారీ చేసే సమయంలో 20 లీటర్ల పిచికారీ డ్రమ్ములో 200 మిల్లీ లీటర్ల ద్రావణంతోపాటు 150 గ్రాముల పసుపు పొడి, 150 గ్రాముల రాళ్ల సున్నం వేసి మిగిలిన భాగం నీరు పోసుకొని.. పంట లేత ౖపైరు నుంచి మొగ్గ దశ వరకు ఏ పంటపై అయినా పిచికారీ చేసుకోవచ్చు. పూత సమయంలో పిచికారీ వద్దు పైరు మొలక దశలో 20 లీటర్ల నీటికి 150 మిల్లీ లీటర్లు, పూత దశకంటే ముందు 20 లీటర్ల నీటికి 200 మిల్లీ లీటర్లు, పిందె సమయంలో 20 లీటర్ల నీటికి 300 లీటర్ల ద్రావణాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పూత విచ్చుకున్న సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ ద్రావణం పిచికారీ చేయవద్దని ఆమె హెచ్చరిస్తున్నారు. పచ్చపురుగు, తెల్లదోమ, రెక్కల పురుగులు, ముఖ్యంగా వరిలో పొడ తెగులు, దోమపోటు, ఉల్లికోడు తెగుళ్లను ఈ ద్రావణం నివారిస్తుంది. మిత్ర పురుగుల సంతతి పెరుగుతుంది.. పంటకు మేలు చేసే మిత్ర పురుగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ ద్రావణం మిత్ర పురుగులను ఆకర్షిస్తుంది. కందిరీగలు, తూనీగలు, తేనెటీగలు ఇతర మిత్ర పురుగులు పైరు పైకి వచ్చి చేరతాయి. పంటలో పూత నిలబడేలా దోహదపడుతుంది. íపిందె రాలడం తగ్గుతుంది. టమాటా పంట మూడు నెలలు ముగియగానే పాత మొక్క కింద మళ్లీ కొత్తగా చిగుర్లు వచ్చి యధావిధిగా పంటను ఇస్తుంది. రసాయనిక పురుగు మందులు వాడిన పంటలకంటే అధిక దిగుబడి వస్తుందని యశోదమ్మ(88979 31488) ధీమాగా చెబుతున్నారు. – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి, వ్యవసాయం, వైఎస్సార్ జిల్లా కలబంద ద్రావణం -
అమెజాన్‌లో పిడకల అమ్మకం
ఆన్లైన్ పోర్టల్స్ అపార్ట్మెంట్ల నుంచి గుండు సూది దాకా దేన్నైనా అమ్మేస్తుంటాయి. ఈ కోవలోకి కొత్తగా వచ్చి చేరిందో వస్తువు. అదేమిటో కాదండోయ్.. ఆవు పేడ. నిజమే.. ఆవుపేడతో చేసిన పిడకలకు ఇప్పు డు ఆన్లైన్లో యమ డిమాండ్. అమెజాన్, షాప్‌క్లూస్ వంటి పోర్టల్స్‌లో ఇప్పుడీ పిడక లు అందుబాటులో ఉన్నాయి. హైందవ ఆచారాల్లో శుభ కార్యానికైనా, కర్మలకైనా ఆవుపేడ తప్పనిసరి. విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈ మధ్య ఖర్చుకు వెనుకాడకుండా అన్ని పనులు సంప్రదాయ పద్ధతుల్లో చేస్తున్నారు. తమ ఆచార వ్యవహారాలు కాపాడుకుంటున్నారు. ఏదో కార్యం పడింది.. మహానగరాల్లో అదెక్కడ దొరుకుతుందో తెలి యదు, పూజాద్రవ్యాలను అమ్మే షాపులకు వెళ్తే దొరుకుతుందనే గ్యారంటీ లేదు. అలాం టి షాపులు కూడా ఎక్కడున్నాయో వెతికి పట్టుకోవాలి. అంత ఓపిక లేని నెటిజన్లు ఇప్పుడు ఎంచక్కా మొబైల్లో ఆర్డరిచ్చే స్తున్నారు. 99 రూపాయలు మొదలు కొని 400 పైచిలుకు (ప్యాక్‌లో పిడకల సంఖ్యను బట్టి) ధరలకు ఆవుపేడ పిడకలు అమెజాన్‌లో లభిస్తున్నాయి. ఇదేదో ఆషా మాషీ వ్యవహారం కాదండోయ్. ఢిల్లీకి చెంది న ఆసియా క్రాఫ్ట్స్ యజమాని ప్రీతి కర్లాకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. ఆసియా క్రాఫ్ట్స్ మతపరమైన సామగ్రిని అమ్ముతుం ది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ప్రీతి పూజాదికాల్లో ఇప్పుడేవి వాడు తున్నారో తెలుసుకోవడానికి భక్తి చానళ్లను చూస్తుంది. ఒకరోజు ఓ స్వామివారు ఆవుపేడ పిడకలను కాల్చాలని, పేడతో వాకిలి అలకాలని చెప్పడంతో... ప్రీతికి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. ఢిల్లీ శివార్లలోని గ్రామాల నుంచి ఆవుపేడతో చేసిన పిడకలను సేకరించి ఆన్లైన్లో అమ్మడం మొదలు పెట్టింది. అయితే ఒక్కొక్కరు ఒక్కో సైజులో, మం దంతో చేస్తుండటంతో ప్యాకింగ్ కష్టమై పో యేది. దీంతో ఓ ఊరిలో సొంతంగా పిడకల తయారీని చేపట్టింది. 8 పిడకల ప్యాక్‌ను ఆసియా క్రాఫ్ట్స్ రూ.419కు అమ్ముతోంది. నెలకు 3,000 పైచిలుకు ప్యాకెట్ల ఆవుపేడ పిడకలను ఈ సంస్థ అమ్ముతోంది. విదేశాల్లో ని హిందూ ఆలయాల నుంచి కూడా వీరికి ఆర్డర్లు వస్తున్నాయి. - సెంట్రల్ డెస్క్ -
ఆవు పేడతో మంచినీరు..!
న్యూయార్క్: ఆవు పేడతో మంచినీటిని సృష్టించవచ్చట. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం అంటున్నారు అమెరికా పరిశోధకులు. తీవ్రమైన కరువు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందించేందుకు ఈ కొత్త పద్ధతి చాలా ఉపయుక్తమని వీరు చెపుతున్నారు. అంతేకాక ఆవు పేడ నుంచి మంచినీరు వేరు చేయగా మిగిలిన వ్యర్థాలను ఎరువుగా కూడా వినియోగించుకోవచ్చని చెపుతున్నారు. అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ‘ద మెక్‌లాహన్ నట్‌రైంట్ సెపరేషన్ సిస్టమ్ (ఎంఎన్‌ఎస్‌ఎస్)’ అనే అతి సూక్ష్మ వడపోత వ్యవస్థను రూపొందించారు. ఇది ఆవు పేడ నుంచి రసాయనాలు, ఇతర వ్యర్థాలను వేరు చేసి సురక్షితమైన మంచినీరు ను, అలాగే ఎరువులను అందిస్తుంది. దీనిపై మిచిగాన్ వర్సిటీ పరిశోధకుడు స్టీవ్ సఫ్ఫర్‌మన్ స్పందిస్తూ.. ‘‘మీ దగ్గర వెయ్యి ఆవులు ఉన్నట్లయితే వాటి నుంచి ఏటా పది మిలియన్ గ్యాలన్ల ఆవు పేడ ఉత్పత్తి అవుతుంది. ఇందులో 90 శాతం మంచినీరే. అయితే ఆవుపేడలో రసాయనాలు, కార్బన్లు, రోగకారకాలు ఉంటాయి. ఆవు పేడ నుంచి మంచినీటిని తీయడం సంక్లిష్టమై న ప్రక్రియ. మంచినీరును తీసిన తర్వాత మిగిలే వ్యర్థాలు పర్యావరణానికి హానికరం. వీటిని కచ్చితంగా ఎరువుగా ఉపయోగించుకోవాలి’’ అని చెప్పారు. ప్రస్తుతం తాము రూపొందించిన విధానం ప్రకారం వంద గ్యాలన్ల ఆవు పేడ నుంచి 50 గ్యాలన్ల సురక్షిత మంచినీరును అందించవచ్చని వెల్లడించారు.