మహిళా క్రికెటర్ ను వేధించిన బోర్డు అధికారిపై కేసు
Published Fri, Nov 29 2013 8:52 PM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
పద్దెనిమిదేళ్ల మహిళా క్రికెటర్ పై ఓ క్రికెట్ అసోసియేషన్ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే వార్త క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) ప్రధాన కార్యదర్శి అల్పేష్ షాపై లైంగిక వేధింపుల పాల్పడ్డారని మహిళా క్రికెటర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎంపీసీఏ ప్రధాన కార్యదర్శి నిర్వాకంపై తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తనపై కేసు నమోదైందనే విషయం తెలుసుకున్న షా గురువారమే తన పదవికి రాజీనామా చేశారు.
హోల్కర్ పరిపాలన భవనంలో సెప్టెంబర్ 23 తేదిన ప్రత్యేకంగా ఆశీస్సులు అందిస్తానని పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. షా ఎంపీసీఏ అండర్-19 క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటికి కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అండర్ 19 జట్టుకు ఎంపిక చేయలేదనే కోపంతోనే ఆరోపణలకు పాల్పడుతుందని మాజీ ఎంపీసీఏ ప్రధాన కార్యదర్శి అన్నారు. చట్టబద్దమైన లాంచనాలను పూర్తి చేసిన తర్వాతనే అతనిపై చర్య తీసుకుంటామని తుకోగంజ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జీ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ వ్యవహారంపై వాస్తవాలను తెలుసుకోవడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఇంద్రాణి దత్తా పర్యవేక్షణలో ఓ కమిటిని నియమించారు.
Advertisement