MPCA
-
బీసీసీఐ స్పందించలేదు!
ఇండోర్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి లోధా ప్యానెల్ పలు ప్రతిపాదనలు సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ పై పలు అనుమానాలు తలెత్తాయి. మరోవైపు కివీస్, భారత్ మధ్య జరగనున్న చివరిదైన మూడో టెస్టుకు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ టెస్టు నిర్వహణపై ఇప్పటివరకూ బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని ఎంపీసీఏ కార్యదర్శి మిలింద్ కన్మాడికర్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 8న ఇండోర్ లోని హోల్కర్ స్డేడియంలో చివరి టెస్టును నిర్వహించనున్న విషయం తెలిసిందే. టెస్టు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు తమకు బీసీసీఐ నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలు అందలేదని తెలిపారు. సుప్రీంకోర్టు నియమించిన ఆర్ఎం లోథా కమిటీ తమ బ్యాంకు ఖాతాలను నిలిపివేసిందని బీసీసీఐ ఆరోపించింది. అయితే బ్యాంకు ఖాతాల నిలుపుదల చేయలేదని లోథా కమిటీ ఓ ప్రకటనలో తెలపడంతో మూడో టెస్టుపై నీలినీడలు తొలిగిపోయాయి. గతంలో బీసీసీఐకి ఇలాంటి సంకట పరిస్థితులు ఎదురుకాలేదు. లోథా కమిటీ సిఫార్సులు అమలుచేయడం కష్టతరమని బీసీసీఐ మొదటినుంచీ చెబుతూనే ఉంది. -
మహిళా క్రికెటర్ ను వేధించిన బోర్డు అధికారిపై కేసు
పద్దెనిమిదేళ్ల మహిళా క్రికెటర్ పై ఓ క్రికెట్ అసోసియేషన్ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే వార్త క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) ప్రధాన కార్యదర్శి అల్పేష్ షాపై లైంగిక వేధింపుల పాల్పడ్డారని మహిళా క్రికెటర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎంపీసీఏ ప్రధాన కార్యదర్శి నిర్వాకంపై తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తనపై కేసు నమోదైందనే విషయం తెలుసుకున్న షా గురువారమే తన పదవికి రాజీనామా చేశారు. హోల్కర్ పరిపాలన భవనంలో సెప్టెంబర్ 23 తేదిన ప్రత్యేకంగా ఆశీస్సులు అందిస్తానని పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. షా ఎంపీసీఏ అండర్-19 క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటికి కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అండర్ 19 జట్టుకు ఎంపిక చేయలేదనే కోపంతోనే ఆరోపణలకు పాల్పడుతుందని మాజీ ఎంపీసీఏ ప్రధాన కార్యదర్శి అన్నారు. చట్టబద్దమైన లాంచనాలను పూర్తి చేసిన తర్వాతనే అతనిపై చర్య తీసుకుంటామని తుకోగంజ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జీ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ వ్యవహారంపై వాస్తవాలను తెలుసుకోవడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఇంద్రాణి దత్తా పర్యవేక్షణలో ఓ కమిటిని నియమించారు.