కరెన్సీ... | currency changes in union budget 2016-2017 | Sakshi
Sakshi News home page

కరెన్సీ...

Published Tue, Mar 1 2016 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

కరెన్సీ...

కరెన్సీ...

ఒక డాలర్‌ను మన కరెన్సీలోకి మార్చుకోవాలంటే ఇప్పుడు దాదాపు రూ.68.42. 1913లో ఒక్క డాలర్ విలువ రూ.0.0869. అదే 1925లో 10 పైసలు. అంటే ఒక్క రూపాయి కావాలంటే 10 డాలర్లు ఇవ్వాలన్న మాట. 1947లో రూపాయి విలువ ఒక డాలర్‌తో సమానం.
భారత్‌లో ఇప్పుడు చలామణిలో ఉన్న అతిపెద్ద నోటు రూ.1000 నోటు. దీన్ని 2010లో కేంద్రం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే 1954 నుంచి 1978 మధ్య రూ.5 వేలు, రూ.10 వేల నోట్లు చలామణిలో ఉండేవి.
అమెరికాలో రోజుకు 3.8 కోట్ల నోట్లను ముద్రిస్తారు. వీటి విలువ రూ.4,482 కోట్లు (65.5 కోట్ల డాలర్లు) ఉంటుంది. ఇందులో 95 శాతం నోట్లను చిరిగిపోయిన, పాత లేదా పూర్తిగా పాడయిపోయిన నోట్ల స్థానంలో ప్రవేశపెడతారు.
అమెరికాలో మొదటి కాగితపు కరెన్సీని 1690లో ప్రవేశపెట్టారు. అప్పట్లో అమెరికాలో బంగారం, వెండితో తయారైన నాణేలను తయారు చేసేవారు. దీంతో నాణేల కొరత ఏర్పడటంతో ఈ లోటును పూడ్చేందుకు 1862లో కాగితపు కరెన్సీని అమెరికా ఆర్థిక శాఖ ప్రవేశపెట్టింది.
అమెరికాలో కరెన్సీ నోట్లకు కూడా జీవిత కాలం ఉంటుంది. ఆ తర్వాత అవి చలామణిలో ఉండేందుకు వీల్లేదు. ఒక్క డాలరు నోటు జీవిత కాలం 22 నెలలు. 50 డాలర్ల నోటు 55 నెలలు, 100 డాలర్ల నోటు జీవిత కాలం 89 నెలలు.
అమెరికాల కరెన్సీ నోట్లపై ఎప్పుడు పురుషుల బొమ్మలే మనకు కన్పిస్తాయి. అయితే అక్కడి నోట్లపై కనిపించే ఒకే ఒక మహిళ అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ భార్య మార్తా వాషింగ్టన్. ఈమె ఫొటో ఉన్న కరెన్సీ నోట్లు 1886 నుంచి 1891లో చలామణిలో ఉండేవి.

ఫిలిప్పైన్స్ నోటు...
ప్చంలోనే అతిపెద్ద బ్యాంకు నోటు ఎంత ఏమిటో తెలుసా! ఫిలిప్పైన్స్‌లోని లక్ష పీసోల (ఫిలిప్పైన్స్ కరెన్సీ) నోటు దాదాపు ఏ4 సైజు (నోటు బుక్) అంత పెద్దగా ఉంటుంది. స్పానిష్ పాలన నుంచి విముక్తి పొందిన సందర్భానికి గుర్తుగా ఈ నోటును 1998లో అక్కడి ప్రభుత్వం ముద్రించింది. అయితే ఈ నోట్లను అక్కడి కలెక్టర్లకు మాత్రమే ఇస్తారు.

 130 ఇయర్స్ ఇక్కడ..
మన ఆర్థిక మంత్రులు ఏడాదికో కొత్త బడ్జెట్ బ్యాగ్‌ను పట్టుకుని పోజిస్తున్నారు గానీ.. బ్రిటన్‌లో 130 ఏళ్లకు పైగా.. ఒకే బడ్జెట్ బాక్స్‌ను వాడారు. ఆ బాక్సే ఇది. దీని పేరు గ్లాడ్‌స్టోన్ రెడ్ బాక్స్.  1860ల్లో అప్పటి బ్రిట న్ ఆర్థిక మంత్రి విలియమ్ ఎడ్వర్డ్ గ్లాడ్‌స్టోన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కోసం దీన్ని తొలిసారిగా వాడారు. అప్పట్నుంచి.. దాదాపు వందేళ్ల పాటు పెచ్చులూడిపోతున్నా.. చిరిగిపోతు న్నా.. ప్రతి ఆర్థిక మంత్రి ఈ బాక్స్‌నే వాడారు.  1964-67 మధ్య అప్పటి ఆర్థిక మంత్రి జేమ్స్ కలాగన్ దీన్ని కాకుండా కొత్త బ్యాగును వాడారు. తర్వాత మళ్లీ షరా మామూలే. మరో 30 ఏళ్లు దీనిదే హవా.  1997లో గోర్డాన్‌బ్రౌన్.. 2007 వరకూ కొత్త బ్యాగులను ఉపయోగించారు. మొన్నమొన్నటి వరకూ అంటే 2010 జూన్ వరకూ దీన్నే వాడారు. ఇక వాడితే బాక్స్ బద్దలయ్యే ప్రమాదముందని గ్రహించారో ఏమో.. దీనికి రిటైర్‌మెంట్ ప్రకటించి.. కేబినెట్ వార్‌రూమ్‌లో దాచిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement