డీ-గ్యాంగ్ ముఠా గుట్టు రట్టు
Published Sat, Feb 25 2017 7:50 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
రాజ్కోట్: గుజరాత్ లో కాంట్రాక్ట్ హత్యలకు పథకం వేసిన హంతక ముఠా గుట్టును పోలీసులు చేధించారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ చెందిన వ్యక్తులుగా ఈ ముఠాను పోలీసులు గుర్తించారు. వీరిలో షార్ప్ షూటర్ సహా ముగ్గురిని నగర శివార్లలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకే దిమ్మతిరిగే ప్లాన్ తో ఈ గ్యాంగ్ హత్యకు పథకం పన్నింది. చివరికు పోలీసులు అప్రతమత్తతో ముఠా ఆటకట్టింది.
పోలీసుల సమాచారం దేశంలో దావూద్ అక్రమ వ్యాపారాలను నిర్వహిస్తున్న పాకిస్తాన్ ఆధారితుడిగా భావిస్తున్న అనీస్ ఇబ్రహీం ఈ కిరాయి హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. జామ్నగర్ చెందిన ఒక వ్యాపారవేత్త ను మట్టుమెట్టడానికి ఈ గ్యాంగ్ భారీ పథకమే రచించాడు. ఇందుకు గాను కాంట్రాక్ట్ కిల్లర్ రాందాస్ రహానే తదితర గ్యాంగ్ తో ఒప్పందం కుదర్చుకొని. రూ. 10లక్షలు సుపారీ ఇచ్చాడు.
జామ్ నగర్ లో రియల్టీ వ్యాపారి, షిప్పింగ్ వ్యాపారవేత్త ను హత్య చేయడానికి వీరు పథకం పన్నారు. ఈ క్రమంలో ఈ గ్యాంగ్ ఒక ప్రైవేట్ బస్సు రాజ్‌కోట్ వస్తుండగా అరెస్ట్ చేసినట్టు నగర డీసీపీ ఎస్ ఆర్ ఓడెదరా చెప్పారు. మరోవైపు ఆ వ్యాపారవేత్తను అష్‌ఫాక్ ఖత్రిగా గుర్తించామన్నారు.
జామ్నగర్ చేరుకొని వాహనాన్ని దొంగిలించి, హత్య చేసి అనంతరం, నకిలీ నంబర్ ప్లేట్ల సహాయంతో తప్పించుకోవాలని చూశారంటూ ఈ కిల్లర్ గ్యాంగ్ మొత్తం ఆపరేషన్ వివరాలను రాజ్కోట్ పోలీసు కమిషనర్ అనుపమ్ సింహ్ గెహ్లాట్ వెల్లడించారు.
మహారాష్ట్ర నుంచి ఒక ప్రైవేట్ బస్సు లో వస్తున్న రాజ్కోట్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై అనుమానాస్పద పద్ధతిలో వెళుతుండగా ఈ నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించామన్నారు. వీరినుంచి ఒక పిస్టల్, ఆరు లైవ్ గుళికలు, రెండు కత్తులు , గుజరాత్, మహారాష్ట్ర కు తప్పుడు వాహన రిజిస్ట్రేషన్ నెంబర్లున్న నకిలీ సంఖ్య ప్లేట్లను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ వెల్లడించారు. ఈ క్రమంలో వ్యాపారవేత్త చంపడానికి అనీస్ ఇబ్రహీంరూ.10 లక్షలు చెల్లించినట్టుగా అంగీకరించాడని తెలిపారు.
కాగా డి-గ్యాంగ్ కాంట్రాక్ట్ కిల్లర్‌గా పూరొందిన రాందాస్ పై మహారాష్ట్ర లో పలు ఆరోపణలు ఉన్నాయి. అనేక కేసులు నమోదైనాయి. ముఖ్యంగా 2011 లో బిల్డర్ మనీష్ ధోలకియా కార్యాలయం కాల్పులు, గార్డు మృతి కేసులో కొంతకాలం జైలుకి వెళ్లాడు. అయితే వారు అయితే మిగిలిన ముగ్గురు వ్యక్తుల పేర్లను అధికారులు బహిర్గతం చేయలేదు.
Advertisement
Advertisement