foiled
-
గొలుసు దొంగను ప్రతిఘటించిన చిన్నారి
క్రైమ్: సమయస్ఫూర్తితో వ్యవహరించడం.. ఆపద సమయంలోనూ అక్కరకు వస్తుంది. కానీ, సమయస్ఫూర్తితో పాటు ధైర్యంగా ఉంటేనే పరిస్థితులను ఎదుర్కోవచ్చని ఇక్కడ ఓ పదేళ్ల చిన్నారి నిరూపించింది. తన బామ్మ మెడలో గొలుసు దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని.. ప్రతిఘటించింది ఆమె పదేళ్ల మనవరాలు. తన ఇద్దరు మనవరాళ్లతో ఆ బామ్మ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో స్కూటీ మీద వచ్చిన ఓ ఆగంతకుడు.. ఆమె మెడలోని చెయిన్ లాక్కోబోయాడు. దీంతో ఆ వృద్ధురాలు ప్రతిఘటించింది. ఇది గమనించిన ఆమె పదేళ్ల మనవరాలు.. చేతిలోని బ్యాగు తీసుకుని ఆ దొంగను యెడా పెడా బాదేసింది. ఆ దెబ్బకు ఆ దొంగ అక్కడి నుంచి ఉడాయించాడు. మహారాష్ట్రలోని పూణేలో ఫిబ్రవరి 25వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. సీసీటీవీ ఫుటేజీలోని చోరీయత్నం- ఆ చిన్నారి అడ్డుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో పూణే సిటీ పోలీసులు స్పందించారు. గురువారం(మార్చి 9న) కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | A 10-year-old girl foiled an attempt by a chain snatcher to snatch her grandmother's chain in Maharashtra's Pune City The incident took place on February 25 & an FIR was registered yesterday after the video of the incident went viral. (CCTV visuals confirmed by police) pic.twitter.com/LnTur7pTeU — ANI (@ANI) March 10, 2023 -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం
శ్రీనగర్ : ఉగ్రవాదులు భారీ ఉగ్ర దాడికి రూపొందించిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. జమ్ము బస్టాండ్ సమీపంలో పార్క్ చేసిన బస్ నుంచి భద్రతా దళాలు మంగళవారం భారీ మొత్తంలో ఆర్డీఎక్స్ను స్వాధీనం చేసుకోవడంతో పెనుముప్పు తప్పింది.కథువా జిల్లా బిలావర్ నుంచి జమ్ముకు ఈ బస్సు చేరుకుందని అధికారులు తెలిపారు. బస్ డ్రైవర్, కండక్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్డీఎక్స్ లభ్యం కావడంపై ప్రశ్నిస్తున్నారు. ఆర్డీఎక్స్తో కూడని ప్యాకెట్‌ను బిలావర్లో తమకు ఓ జంట అప్పగించిందని బస్ డ్రైవర్ భద్రతా దళాలకు చెప్పినట్టు తెలిసింది. కాగా ఇటీవల బిలావల్‌లోని దేవల్ ప్రాంతంలో ఓ ఇంటి నుంచి 40 కిలోల గన్ పౌడర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ప్రసాదంలో విషం కలిపి..
ముంబై : ముంబ్రేశ్వర్ ఆలయంలో భక్తులకు ఇచ్చే మహా ప్రసాదంలో విషం కలిపి 400 మందిని చంపాలనే ఉగ్ర కుట్రను పోలీసులు ఛేదించారు. ఈ ఏడాది జనవరిలో ముంబై సమీపంలోని ముంబ్రాలో అరెస్టయిన ఉగ్రవాదుల బృందం ఈ మేరకు పథకరచన చేసిందని మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఐఎస్‌తో పాటు ఇస్లాం ప్రబోధకుడు జకీర్ నాయక్‌ల ప్రేరణతో వారు ఈ ఘాతుకానికి తెగబడినట్టు చార్జిషీట్లో పేర్కొన్నారు. నిందితుల సోషల్ మీడియా ప్రొఫైల్‌లో జకీర్ నాయక్‌కు సంబంధించిన పలు వీడియోలు ఉండటం గమనార్హం. 400 మంది హిందూ భక్తులను చంపే ఉద్దేశంతో ప్రసాదంలో విషం కలిపేందుకు వారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ముంబ్రేశ్వర్ ఆలయాన్ని వారు ఎంపిక చేసుకున్నారు. థానే జిల్లా ముంబ్రా బైపాస్ వద్ద వారు బ్లాస్ట్ ట్రయల్స్‌ను చేపట్టారని ఏటీఎస్ అధికారులు తెలిపారు. పేలడు పదార్ధాలు, విషపూరిత పదార్ధాల తయారీలో శిక్షణ కూడా తీసుకున్నట్టు వెల్లడైంది. ఐఎస్‌తో సంబంధాలు కలిగిన ఉమ్మాతే మహ్మదీయ గ్రూపునకు చెందిన 10 మంది సభ్యులను మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేసి భారీ ఉగ్ర కుట్రలను నిలువరించింది. -
డీ-గ్యాంగ్ ముఠా గుట్టు రట్టు
రాజ్‌కోట్: గుజరాత్ లో కాంట్రాక్ట్ హత్యలకు పథకం వేసిన హంతక ముఠా గుట్టును పోలీసులు చేధించారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ చెందిన వ్యక్తులుగా ఈ ముఠాను పోలీసులు గుర్తించారు. వీరిలో షార్ప్ షూటర్ సహా ముగ్గురిని నగర శివార్లలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకే దిమ్మతిరిగే ప్లాన్ తో ఈ గ్యాంగ్ హత్యకు పథకం పన్నింది. చివరికు పోలీసులు అప్రతమత్తతో ముఠా ఆటకట్టింది. పోలీసుల సమాచారం దేశంలో దావూద్ అక్రమ వ్యాపారాలను నిర్వహిస్తున్న పాకిస్తాన్ ఆధారితుడిగా భావిస్తున్న అనీస్ ఇబ్రహీం ఈ కిరాయి హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. జామ్‌నగర్ చెందిన ఒక వ్యాపారవేత్త ను మట్టుమెట్టడానికి ఈ గ్యాంగ్ భారీ పథకమే రచించాడు. ఇందుకు గాను కాంట్రాక్ట్ కిల్లర్ రాందాస్ రహానే తదితర గ్యాంగ్ తో ఒప్పందం కుదర్చుకొని. రూ. 10లక్షలు సుపారీ ఇచ్చాడు. జామ్ నగర్ లో రియల్టీ వ్యాపారి, షిప్పింగ్ వ్యాపారవేత్త ను హత్య చేయడానికి వీరు పథకం పన్నారు. ఈ క్రమంలో ఈ గ్యాంగ్ ఒక ప్రైవేట్ బస్సు రాజ్‌కోట్ వస్తుండగా అరెస్ట్ చేసినట్టు నగర డీసీపీ ఎస్ ఆర్ ఓడెదరా చెప్పారు. మరోవైపు ఆ వ్యాపారవేత్తను అష్ఫాక్ ఖత్రిగా గుర్తించామన్నారు. జామ్‌నగర్ చేరుకొని వాహనాన్ని దొంగిలించి, హత్య చేసి అనంతరం, నకిలీ నంబర్ ప్లేట్ల సహాయంతో తప్పించుకోవాలని చూశారంటూ ఈ కిల్లర్ గ్యాంగ్ మొత్తం ఆపరేషన్ వివరాలను రాజ్‌కోట్ పోలీసు కమిషనర్ అనుపమ్ సింహ్ గెహ్లాట్ వెల్లడించారు. మహారాష్ట్ర నుంచి ఒక ప్రైవేట్ బస్సు లో వస్తున్న రాజ్‌కోట్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై అనుమానాస్పద పద్ధతిలో వెళుతుండగా ఈ నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించామన్నారు. వీరినుంచి ఒక పిస్టల్, ఆరు లైవ్ గుళికలు, రెండు కత్తులు , గుజరాత్, మహారాష్ట్ర కు తప్పుడు వాహన రిజిస్ట్రేషన్ నెంబర్లున్న నకిలీ సంఖ్య ప్లేట్లను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ వెల్లడించారు. ఈ క్రమంలో వ్యాపారవేత్త చంపడానికి అనీస్ ఇబ్రహీంరూ.10 లక్షలు చెల్లించినట్టుగా అంగీకరించాడని తెలిపారు. కాగా డి-గ్యాంగ్ కాంట్రాక్ట్ కిల్లర్‌గా పూరొందిన రాందాస్ పై మహారాష్ట్ర లో పలు ఆరోపణలు ఉన్నాయి. అనేక కేసులు నమోదైనాయి. ముఖ్యంగా 2011 లో బిల్డర్ మనీష్ ధోలకియా కార్యాలయం కాల్పులు, గార్డు మృతి కేసులో కొంతకాలం జైలుకి వెళ్లాడు. అయితే వారు అయితే మిగిలిన ముగ్గురు వ్యక్తుల పేర్లను అధికారులు బహిర్గతం చేయలేదు. -
పోలీసులు వెంబడిస్తుండగా కాల్పులు జరిపాడు
-
నాగరాజు దీక్ష భగ్నం
దొమ్మేరు (కొవ్వూరు రూరల్), న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా కొవ్వూరు మండలం దొమ్మేరులో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు, రాష్ట్ర ఎంపీటీసీల చాంబర్ మాజీ అధ్యక్షుడు ముదునూరి నాగరాజు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఆగస్టు 27వ తేదీన దొమ్మేరు ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన శిబిరంలో నాగరాజు ఆమరణ నిరాహారదీక్షను చేపట్టారు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సీఐ ఎం.బాలకృష్ణ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై బి.విజయ్‌కుమార్, సిబ్బంది దొమ్మేరులోని దీక్షా శిబిరానికి వెళ్లి దీక్షను విరమించాలని నాగరాజును కోరారు. దీనికి ఆయన అంగీకరించలేదు. దీక్షను కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. అయినా పోలీసులు నాగరాజును దీక్షా శిబిరం నుంచి బలవంతంగా జీపులో ఎక్కించి కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్ భాస్కరకుమార్ వైద్య పరీక్షలు నిర్వహించి వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించాలని, లేకపోతే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని పోలీసులకు తెలిపారు. వారి సూచన మేరకు నాగరాజుకు సిలైన్లు ఎక్కించి దీక్షను భగ్నం చేశారు. నాగరాజు దాదాపు 89 గంటలు ఆమరణ నిరహారదీక్ష చేశారు. దీక్షను భగ్నం చేయడంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండి పట్టాభి రామారావు, పార్టీ నాయకులు వరిగేటి సుధాకర్, రుద్రం వీరబాబు తదితరులు శనివారం ఉదయం ఆస్పత్రికి చేరుకుని నాగరాజుకు సంఘీభావం తెలిపారు.