Dawood gang
-
ఐపీఎల్ బెట్టింగ్‌లో అర్బాజ్‌ఖాన్
ముంబై/థానే: 2008లో భారత క్రికెట్‌ను, బాలీవుడ్‌ను కుదిపేసిన బెట్టింగ్ కేసు విచారణలో భాగంగా లాగిన తీగతో భారీ క్రికెట్ బెట్టింగ్ డొంక కదిలింది. 2008 ఐపీఎల్ బెట్టింగ్‌కు సంబంధించిన కేసులో దావూద్ అనుచరుడు, హైప్రొఫైల్ బుకీ సోనూ యోగేంద్ర జలన్‌ను అరెస్టు చేసి విచారించగా ఏటా ఐపీఎల్లో జరుగుతున్న బెట్టింగ్ వ్యవహారంతో పాటు తాజా సీజన్లో చేతులు మారిన కోట్ల రూపాయలు, భాగస్వాములైన బాలీవుడ్ ప్రముఖుల వివరాలూ వెల్లడయ్యాయి. గతవారం ముగిసిన 11వ సీజన్ ఐపీఎల్‌లోనూ వేలకోట్ల బెట్టింగ్ జరిగిందని ఇందులో బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారని సోనూ చెప్పాడు. ఈ సీజన్లో బాలీవుడ్ నటుడు, సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్బాజ్ ఖాన్ రూ.2.8 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అర్బాజ్ శనివారం విచారణకు రావాలంటూ థానే పోలీస్ బలవంతపు వసూళ్ల నిరోధక బృందం (ఏఈసీ) నోటీసులు పంపింది. అర్బాజ్‌ను బెట్టింగ్‌పై విచారించి అతని ఖాతాలు, లావాదేవీలను పరిశీలించనున్నారు. ‘బుకీల ద్వారానే అర్బాజ్ పెద్దమొత్తంలో డబ్బును బెట్టింగ్‌లో పెట్టారని తెలిసింది. అర్బాజ్ వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం’ అని ఈ కేసును విచారిస్తున్న ఏఈసీ సెల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ శర్మ వెల్లడించారు. కాగా, బెట్టింగ్, పోలీసుల నోటీసులపై తనకు తెలియదని అర్బాజ్ తండ్రి సలీమ్ ఖాన్ పేర్కొన్నారు. విచారణలో విస్తుపోయే అంశాలు ఓ ప్రైవేటు వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. పోలీసుల విచారణ సందర్భంగా సోనూ తెలిపిన వివరాలు విస్తుపోయేలా ఉన్నాయి. అర్బాజ్ బెట్టింగ్‌కు పాల్పడ్డట్లు ఆధారాలతోపాటు.. అతని లావాదేవీల వివరాలనూ ఏఈసీ పోలీసులు సంపాదించారు. సల్మాన్ సోదరుడు దాదాపు రూ. 2.8కోట్లు కేవలం ఈ ఏడాది ఐపీఎల్ బెట్టింగ్‌లో నష్టపోయినట్లు తెలిసింది. అయితే.. ఈ రూ. 2.8 కోట్లను అర్బాజ్ ఇంకా చెల్లించలేదని తెలిసింది. ఈ మొత్తాన్ని చెల్లించాలని అడుగుతున్నా అర్బాజ్ స్పందించడం లేదని.. దీంతో ఇరువురి మధ్య గొడవ జరుగుతోందని సోనూ పోలీసులకు తెలిపారు. ఈ మొత్తాన్ని చెల్లించని పక్షంలో పేరును బయటకు చెబుతానని అర్బాజ్‌ను బెదిరించినట్లు కూడా సోనూ ఒప్పుకున్నారు. గతంలో 2 మ్యాచుల్లో అర్బాజ్ బెట్టింగ్ పెట్టాడని వెల్లడించాడు. ముంబై బుకీలకు దావూద్ గ్యాంగ్‌తో సంబంధాలపైనా సోనూ కీలక సమాచారమిచ్చాడు. గతంలో ఐపీఎల్ కేసులో అరెస్టయిన నటుడు విందూ దారాసింగ్, ఇద్దరు ప్రముఖులు సోనూ ద్వారానే బెట్టింగ్‌కు పాల్పడ్డారు. బెట్టింగ్ కింగ్ సోనూ! ముంబై సట్టా బజార్, గ్యాంబ్లింగ్ సర్కిల్స్‌లో సోనూ పేరు తెలియని వారుండరు. ఇతనికి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా,దక్షిణాఫ్రికా ఇతర దేశాల్లోనూ క్లయింట్లు ఉన్నారు. ‘బెట్ అండ్ టేక్’ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి దీని ద్వారా ఐపీఎల్‌తోపాటు భారత్‌లో, విదేశాల్లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను నడిపిస్తున్నాడు. 2016లో శ్రీలంక–ఆస్ట్రేలియా మధ్య శ్రీలంకలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌ను సోనూ ఫిక్స్ (క్యురేటర్ సాయంతో) చేసినట్లు ఆధారాలు దొరికాయి. అర్బాజ్‌తో తన సాన్నిహిత్యాన్ని తెలుపుతూ పలు చిత్రాలను సోనూ పోలీసులకిచ్చాడు. సోనూ వద్ద స్వాధీనం చేసుకున్న డైరీలో బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు ప్రముఖ కాంట్రాక్టర్లు, బిల్డర్లు, షేర్‌మార్కెట్ పెట్టుబడిదారులు, 100 మంది బుకీల వివరాలున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు సోనూ సహా ఆరుగురు బుకీలను అరెస్టు చేశారు. థానే జిల్లా డోంబివలీలోని ఓ హోటల్ నుంచి మే 15న మరో ముగ్గురిని బెట్టింగ్ కేసులో ఏఈసీ బృందం అరెస్టు చేసింది. వీరిని మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకొచ్చారు. ఈ సమయంలో వీరికి సాయం చేసేందుకు వచ్చిన సోనూను పోలీసులు వలపన్ని అరెస్టు చేయటం, విచారణ జరపడంతో తాజా ఐపీఎల్ బెట్టింగ్‌పై కొత్త అంశాలు బయటికొచ్చాయి. సోనూ∙నుంచి సేకరించిన సమాచారంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు ఒకరున్నట్లు తెలుస్తున్నప్పటికీ అది ఎవరనే విషయం బయటకు తెలియడంలేదు. సోనూ టర్నోవర్ ఏడాదికి రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. -
మూడు టెస్టులు ఫిక్స్!
న్యూఢిల్లీ: మళ్లీ ఫిక్సింగ్ భూతం బుసలు కొట్టింది. గత రెండేళ్లుగా భారత్ ఆడిన మూడు టెస్టులు ఫిక్స్ అయినట్లు ఖతర్‌కు చెందిన అల్ జజీరా టీవీ చానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడవడంతో క్రికెట్ ప్రపంచం ఉలిక్కి పడింది. ఇదంతా కూడా దావూద్ (డి) గ్యాంగ్ కనుసన్నల్లో జరిగినట్లు ఈ చానెల్ నిర్వహించిన శూల శోధనలో వెల్లడైంది. ఇందులో ముంబైకి చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ రాబిన్ మోరిస్ హస్తం ఉన్నప్పటికీ టీమిండియా క్రికెటర్ల ప్రమేయం లేకపోవడం ఊరట. ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో భారత క్రికెటర్ల పేర్లు మాత్రం లేవు. జర్నలిస్ట్ డేవిడ్ హారిసన్ ఈ ఆపరేషన్‌ను ముంబై, యూఏఈ, శ్రీలంకల్లో నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో డాక్యుమెంటరీ ఆదివారం ‘హిందుస్తాన్ టైమ్స్’ వెబ్సైట్లో ప్రసారమైంది. మొత్తం మ్యాచ్, ఇన్నింగ్స్ కాకుండా కొన్ని ఓవర్లు, సెషన్లు మాత్రమే ఫిక్సయ్యాయి. అంటే మ్యాచ్‌లు జరిగిన ఐదు రోజుల్లో ఏదో ఓ రోజు పది ఓవర్లో, 20 ఓవర్లో ఫిక్స్ అయ్యాయి. చెన్నై (2016)లో భారత్–ఇంగ్లండ్ టెస్టు, గతేడాది రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు, గాలే (శ్రీలంక)లో శ్రీలంకతో ఆడిన టెస్టు మ్యాచ్‌లు బుకీలు, ఫిక్సర్ల బారిన పడినట్లు ఆ డాక్యుమెంటరీలో వెల్లడైంది. ఇందులో ఇద్దరు ఆస్ట్రేలియన్, ముగ్గురు ఇంగ్లండ్ క్రికెటర్ల పాత్ర ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే సదరు ఆటగాళ్ల పేర్లను ‘బీప్’సౌండ్‌తో వినపడకుండా కవర్ చేశారు. పాకిస్తాన్, శ్రీలంక ఆటగాళ్ల పేర్లు మాత్రం వినిపించాయి. హసన్ రజా (పాక్ తరఫున టెస్టు ఆడిన అతిపిన్న క్రికెటర్), దిల్హార లోకుహెత్తిగె, జీవంత కులతుంగ, తరిందు మెండీస్ (శ్రీలంక)లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తెలిసింది. వీరితో పాటు గాలే పిచ్ క్యురేటర్ తరంగ ఇండిక పేరు వినిపించింది. ఆయన గాలేలో జరిగిన శ్రీలంక–ఆసీస్, భారత్–లంక టెస్టుల్లో పిచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. శూల శోధన వీడియోలో డి–గ్యాంగ్‌కు చెందిన అనీల్ మునవర్ మాట్లాడుతూ ‘ప్రతీ స్క్రిప్టు నాదే. నేనిచ్చిందే జరుగుతుంది... జరిగి తీరుతుంది’ అని జర్నలిస్ట్‌కు వెల్లడించారు. ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్లకు రూ. 2 కోట్లు నుంచి 6 కోట్ల వరకు ఇస్తామన్నారు. గాలే క్యురేటర్‌కు రూ. 25 లక్షలిచ్చామని ఇది ఆయన (క్యురేటర్) ఎనిమిదేళ్ల జీతంతో సమానమని చెప్పారు. భారత మాజీ దేశవాళీ ఆటగాడు రాబిన్ మోరిస్ మాట్లాడుతూ ‘నా చేతిలో 30 మంది ఆటగాళ్లున్నారు. వాళ్లంతా నేనేది చెబితే అదే చేస్తారు’ అని అన్నాడు. అతని వ్యాపార భాగస్వామి గౌరవ్ రాజ్‌కుమార్ ‘మాకు గేమ్ వినోదంతో పనిలేదు. ఆట గురించి పట్టించుకోం. మాకు కావాల్సింది డబ్బే! దాని కోసమే ఇదంతా చేస్తున్నాం’ అని చెప్పాడు. ఐసీసీ పూర్తిస్థాయి విచారణ... ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెల్లడించింది. ఇందులో ఆరోపణలెదుర్కొంటున్న ఆటగాళ్ల దేశాలతో మాట్లాడి పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం... ముందు సాక్ష్యాలు కావాలని, విశ్వసనీయ రుజువులందాకే తమ ఆటగాళ్ల ప్రమేయంపై విచారణ చేపడుతామని తెలిపింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ టామ్ హారిసన్ మాట్లాడుతూ భారత్‌తో జరిగిన టెస్టులో మాకెలాంటి సందేహాలు లేవని, ఆటగాళ్లను అనుమానించాల్సిన అవసరం లేదని అన్నారు. ఐసీసీ దర్యాప్తు తర్వాతే... ఐసీసీ దర్యాప్తు జరిగేదాకా వేచి చూస్తామని, ఆ తర్వాతే తమ బోర్డు పరిధిలో విచారణ నిర్వహిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై ఆటగాడు రాబిన్ మోరిస్‌కు బోర్డు నుంచి రూ. 22,500 పెన్షన్ చెల్లిస్తున్నామని, దోషిగా తేలితే దాన్ని నిలిపివేస్తామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
దావూద్ గ్యాంగ్‌లో లేడీస్ టీం
సాక్షి, ముంబై : అండర్‌వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తన చీకటి సామ్రాజాన్ని విస్తరించేందుకు మహిళలకూ ఎర వేస్తున్నాడు. మాఫియా గ్యాంగ్‌లు తమ కార్యకలాపాల్లో మహిళలు, కుంటుంబాలను దూరం పెడితే డీ గ్యాంగ్ మాత్రం ప్రత్యేకంగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడైంది. మహిళలు టార్గెట్‌గా ఉన్న ఆపరేషన్స్‌ను చక్కబెట్టేందుకు లేడీస్ వింగ్‌ను రంగంలోకి దించే వ్యూహంతో డీ కంపెనీ ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు నిఘా సంస్థలు భావిస్తున్నాయి. మహిళా సభ్యుల ఫోన్ కాల్స్‌ను నిఘా వర్గాలు విశ్లేషించగా నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రత్యేక విభాగం మహిళల నుంచి నిత్యం సొమ్ము వసూళ్లు చేస్తూ తమకు కేటాయించిన మిషన్స్‌పై ఎప్పటికప్పుడు దావూద్‌కు వివరాలు చేరవేస్తున్నట్టు తెలిసింది. దావూద్‌కు అత్యంత సన్నిహితుడైన చోటా షకీల్ లేడీస్ వింగ్ బాధ్యతను ఉస్మాన్ అనే తన సన్నిహితుడికి కట్టబెట్టాడు. లేడీస్ వింగ్‌కు సంబంధించిన సమాచారం, వారు సాగిస్తున్న కార్యకలాపాలపై మాజీ ఐపీఎస్ అధికారి పీకే జైన్ విస్తుపోయారు. పోలీస్ అధికారిగా తన హయాంలో ఇలాంటి అంశాలు ఎన్నడూ తన అనుభవంలోకి రాలేదని మాఫియా కార్యకలాపాలను నిర్వహించడంలో దావూద్ ఇబ్రహీం నిస్సహాయ స్థితిలో ఉన్నాడనేందుకు ఇది సంకేతమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. పాకిస్తాన్‌కు చెందిన ఫోన్ నెంబర్ల నుంచి రూ కోటి డిమాండ్ చేస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయని ముంబయి ఖర్ పోలీస్ స్టేషన్లో మహిళ ఫిర్యాదు చేయడంతో డీ కంపెనీ మహిళా విభాగం కార్యకలాపాలు వెలుగుచూశాయి. మరోవైపు పోలీస్ నిఘా, దర్యాప్తు సంస్థల కన్నుగప్పేందుకు దావూద్ ముఠా వ్యూహం మార్చిందని.. ఇప్పుడు దావూద్ బిట్‌కాయిన్స్‌లో లావాదేవీలు కొనసాగిస్తున్నాడని, సంప్రదాయ కరెన్సీ నుంచి ప్రత్యామ్నాయాలకు మళ్లాడని భావిస్తున్నారు. -
డీ-గ్యాంగ్ ముఠా గుట్టు రట్టు
రాజ్‌కోట్: గుజరాత్ లో కాంట్రాక్ట్ హత్యలకు పథకం వేసిన హంతక ముఠా గుట్టును పోలీసులు చేధించారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ చెందిన వ్యక్తులుగా ఈ ముఠాను పోలీసులు గుర్తించారు. వీరిలో షార్ప్ షూటర్ సహా ముగ్గురిని నగర శివార్లలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకే దిమ్మతిరిగే ప్లాన్ తో ఈ గ్యాంగ్ హత్యకు పథకం పన్నింది. చివరికు పోలీసులు అప్రతమత్తతో ముఠా ఆటకట్టింది. పోలీసుల సమాచారం దేశంలో దావూద్ అక్రమ వ్యాపారాలను నిర్వహిస్తున్న పాకిస్తాన్ ఆధారితుడిగా భావిస్తున్న అనీస్ ఇబ్రహీం ఈ కిరాయి హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. జామ్‌నగర్ చెందిన ఒక వ్యాపారవేత్త ను మట్టుమెట్టడానికి ఈ గ్యాంగ్ భారీ పథకమే రచించాడు. ఇందుకు గాను కాంట్రాక్ట్ కిల్లర్ రాందాస్ రహానే తదితర గ్యాంగ్ తో ఒప్పందం కుదర్చుకొని. రూ. 10లక్షలు సుపారీ ఇచ్చాడు. జామ్ నగర్ లో రియల్టీ వ్యాపారి, షిప్పింగ్ వ్యాపారవేత్త ను హత్య చేయడానికి వీరు పథకం పన్నారు. ఈ క్రమంలో ఈ గ్యాంగ్ ఒక ప్రైవేట్ బస్సు రాజ్‌కోట్ వస్తుండగా అరెస్ట్ చేసినట్టు నగర డీసీపీ ఎస్ ఆర్ ఓడెదరా చెప్పారు. మరోవైపు ఆ వ్యాపారవేత్తను అష్ఫాక్ ఖత్రిగా గుర్తించామన్నారు. జామ్‌నగర్ చేరుకొని వాహనాన్ని దొంగిలించి, హత్య చేసి అనంతరం, నకిలీ నంబర్ ప్లేట్ల సహాయంతో తప్పించుకోవాలని చూశారంటూ ఈ కిల్లర్ గ్యాంగ్ మొత్తం ఆపరేషన్ వివరాలను రాజ్‌కోట్ పోలీసు కమిషనర్ అనుపమ్ సింహ్ గెహ్లాట్ వెల్లడించారు. మహారాష్ట్ర నుంచి ఒక ప్రైవేట్ బస్సు లో వస్తున్న రాజ్‌కోట్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై అనుమానాస్పద పద్ధతిలో వెళుతుండగా ఈ నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించామన్నారు. వీరినుంచి ఒక పిస్టల్, ఆరు లైవ్ గుళికలు, రెండు కత్తులు , గుజరాత్, మహారాష్ట్ర కు తప్పుడు వాహన రిజిస్ట్రేషన్ నెంబర్లున్న నకిలీ సంఖ్య ప్లేట్లను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ వెల్లడించారు. ఈ క్రమంలో వ్యాపారవేత్త చంపడానికి అనీస్ ఇబ్రహీంరూ.10 లక్షలు చెల్లించినట్టుగా అంగీకరించాడని తెలిపారు. కాగా డి-గ్యాంగ్ కాంట్రాక్ట్ కిల్లర్‌గా పూరొందిన రాందాస్ పై మహారాష్ట్ర లో పలు ఆరోపణలు ఉన్నాయి. అనేక కేసులు నమోదైనాయి. ముఖ్యంగా 2011 లో బిల్డర్ మనీష్ ధోలకియా కార్యాలయం కాల్పులు, గార్డు మృతి కేసులో కొంతకాలం జైలుకి వెళ్లాడు. అయితే వారు అయితే మిగిలిన ముగ్గురు వ్యక్తుల పేర్లను అధికారులు బహిర్గతం చేయలేదు. -
మనోడు మహాముదురే...
నెల్లూరు (క్రైమ్): మేము దావూద్ ఇబ్రహీం (డి-గ్యాంగ్) అనుచరులం.. రూ.100 కోట్లు ఇవ్వాలి.. లేదంటే చంపుతాం.. అంటూ బీసీసీ సభ్యుడు రాజీవ్‌శుక్లాను బెదిరించిన నెల్లూరుకు చెందిన ఫత్తే అహ్మద్ పెద్ద ముదురని నిఘావర్గాల విచారణలో తేలింది. ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేసిన ఫత్తే అహ్మద్ కంప్యూటర్ను వినియోగించుకుని ఏమైనా చేయగల దిట్ట. ఎంబీఏ పూర్తిచేసిన ఫత్తే 2013లో దేశంలోని ఓ ప్రముఖ ఫైనాన్స్ గ్రూప్ ఫ్రాంచైజీగా రామలింగాపురంలో రైట్వే క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటె డ్ పేరిట కార్యాలయం తెరిచాడు. రూ.లక్ష ఇస్తే రూ.10 లక్షలు ఫైనాన్స్ ఇస్తామని ప్రకటనలు గుప్పించాడు. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని జిల్లాలో 300 మంది సభ్యులను చేర్పించుకున్నా డు. ఫ్రాంచైజర్ అని నమ్మించేందుకు ఒడి శా, అస్సాం తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులను కార్యాలయం లో ఉద్యోగులుగా నియమించుకున్నాడు. ముంబై, ఢిల్లీల్లో ఇద్దరు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ఫైనాన్స్ కోసం వచ్చే వారి సర్టిఫికెట్లను అప్రూవల్ కోసం వారికి పంపేవాడు. వారు కొన్నింటిని అప్రూవల్ చేసి మరికొన్నింటిని వివిధ కారణాలతో రిజెక్ట్ చేసేవారు. ఇలా అందరి వద్ద నమ్మకం పెంచుకుని పెద్దమొత్తంలో నగదు కట్టించుకున్నాడు. ఈ నేపథ్యంలో నగరంలోని ఓ కళ్యాణమండపం యజ మాని తనకు రూ.50 లక్షలు ఫైనాన్స్ కావాలని ఫత్తేను సంప్రదించాడు. అతడి అవసరాన్ని పసిగట్టిన ఫత్తే రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.50 లక్షలు ఇస్తామని చెప్పడంతో అతను అడిగిన మొత్తాన్ని జమచేశారు. నెలలు గడుస్తున్నా ఫైనాన్స్ ఇవ్వకపోవడంతో బాధితుడు కంపెనీ వ్యవహారంపై అనుమానం వచ్చి ఆరాతీయగా అంతా మోసమని తేలింది. ఈ విషయాన్ని గమనించిన ఫత్తే అప్పటి అధికారపార్టీ నేత అండతో విషయం పెద్దది కాకుండా చూసుకున్నాడు. అనంతరం బోర్డు తిప్పేశాడు. ఈక్రమంలోనే అతడికి షఫీవుల్లాతో పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. అంతేకాకుండా ఫత్తే క్రికెట్ బెట్టింగ్‌లు, రేసింగ్‌లు, పలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవాడన్న ఆరోపణలున్నాయి. జిల్లాలోని ఓ మైనార్టీ పెద్దతో ఫత్తేకు దగ్గర సంబంధాలున్నాయి. సినిమా హీరోలు, మ్యూజిక్ డెరైక్టర్లతో పాటు ఢిల్లీ, ముంబై, కోలకత్తాలోని బడా వ్యక్తులతో పరిచయాలున్న ఆ మైనార్టీ పెద్ద ద్వారా పెద్ద లాబీ నడిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.