'ఆ కారును దహనం చేస్తున్నాం' | Dawood Ibrahim's Car, Sold At Auction, To Be Burnt | Sakshi
Sakshi News home page

'ఆ కారును దహనం చేస్తున్నాం'

Published Wed, Dec 23 2015 9:28 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

'ఆ కారును దహనం చేస్తున్నాం'

'ఆ కారును దహనం చేస్తున్నాం'

ముంబై: వేలంలో దక్కించుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కారును బహిరంగంగా దహనం చేయనున్నారు. ఢిల్లీకి సమీపంలోని ఘజియబాద్ లో బుధవారం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల ప్రాంతంలో దీనికి నిప్పుపెట్టనున్నారు. 'ఘజియాబాద్ లోని ఇంద్రపురంలో బహిరంగంగా ఈ కారును తగులబెట్టాలని మా సంస్థ నిర్ణయించింది' అని ఈ వాహనాన్ని దక్కించుకున్న స్వామి చక్రపాణి పీటీఐతో ఫోన్ లో చెప్పారు.

దావూద్, అతడి ముఠా పాల్పడిన తీవ్రవాద కార్యకలాపాలకు అంత్యక్రియలు నిర్వహించాలన్న ఉద్దేశంతో కారును దహనం చేస్తున్నట్టు ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చక్రపాణి తెలిపారు. డిసెంబర్ 9న నిర్వహించిన వేలంలో దావూద్ కు చెందిన ఆకుపచ్చ హ్యుందయ్ ఆసెంట్ కారును రూ.32 వేలకు ఆయన దక్కించుకున్నారు.

ఈ కారు అంబులెన్స్ లా మార్చాలనుకున్నానని ఆయన అనుకున్నారు. అయితే దావూద్ అనుచరుల నుంచి బెదిరింపులు రావడంతో వారికి తగిన సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతో దాన్ని బహిరంగంగా దహనం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ కారును కొద్దిరోజుల క్రితమే ముంబై నుంచి ఢిల్లీకి తరలించారు.

Advertisement
Advertisement