Swami Chakrapani
-
‘బంగారు ఇటుకలతో రామ మందిర నిర్మాణం’
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్యలో నిర్మించబోయే రామమందిర నిర్మాణంలో పూర్తిగా బంగారపు ఇటుకలు వాడాలని హిందూ మహాసభ నాయకుడు స్వామి చక్రపాణి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ‘రామ మందిర నిర్మాణంపై త్వరలోనే సుప్రీంకోర్టు తీర్పు రానుంది. మందిర నిర్మాణానికి అనుకూలంగానే తీర్పు రాబోతుంది. మందిరాన్ని పూర్తిగా బంగారపు ఇటుకలతో నిర్మించాలి’ అని డిమాండ్ చేశారు. కాగా భారత రాజకీయాలను ప్రభావితం చేయగల ‘రామ జన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదం’ కేసు తీర్పు నవంబర్లో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థల వివాదానికి సంబంధించి కేసులో ఇరు పక్షాల తరఫున వాదనలను అక్టోబర్ 18కల్లా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇరుపక్షాలను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ కేసు తీర్పు మరో రెండు నెలల్లో వెలువడనుంది. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా ఇరుపక్షాల వారు వివాదాన్ని పరిష్కరించుకోవాలనుకుంటే అందుకు తమకేమీ అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు సీజే జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. -
'ఆ కారును దహనం చేస్తున్నాం'
ముంబై: వేలంలో దక్కించుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కారును బహిరంగంగా దహనం చేయనున్నారు. ఢిల్లీకి సమీపంలోని ఘజియబాద్ లో బుధవారం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల ప్రాంతంలో దీనికి నిప్పుపెట్టనున్నారు. 'ఘజియాబాద్ లోని ఇంద్రపురంలో బహిరంగంగా ఈ కారును తగులబెట్టాలని మా సంస్థ నిర్ణయించింది' అని ఈ వాహనాన్ని దక్కించుకున్న స్వామి చక్రపాణి పీటీఐతో ఫోన్ లో చెప్పారు. దావూద్, అతడి ముఠా పాల్పడిన తీవ్రవాద కార్యకలాపాలకు అంత్యక్రియలు నిర్వహించాలన్న ఉద్దేశంతో కారును దహనం చేస్తున్నట్టు ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చక్రపాణి తెలిపారు. డిసెంబర్ 9న నిర్వహించిన వేలంలో దావూద్ కు చెందిన ఆకుపచ్చ హ్యుందయ్ ఆసెంట్ కారును రూ.32 వేలకు ఆయన దక్కించుకున్నారు. ఈ కారు అంబులెన్స్ లా మార్చాలనుకున్నానని ఆయన అనుకున్నారు. అయితే దావూద్ అనుచరుల నుంచి బెదిరింపులు రావడంతో వారికి తగిన సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతో దాన్ని బహిరంగంగా దహనం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ కారును కొద్దిరోజుల క్రితమే ముంబై నుంచి ఢిల్లీకి తరలించారు.