బాలీవుడ్ హాస్యనటుడు దేవేన్ వర్మ కన్నుమూత | Deven Verma no more | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ హాస్యనటుడు దేవేన్ వర్మ కన్నుమూత

Published Wed, Dec 3 2014 3:24 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ హాస్యనటుడు దేవేన్ వర్మ కన్నుమూత - Sakshi

బాలీవుడ్ హాస్యనటుడు దేవేన్ వర్మ కన్నుమూత

పుణే: బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు దేవేన్ వర్మ మంగళవారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా పుణేలోని ఒక ఆస్పత్రిలో చేరిన 78 ఏళ్ల దేవేన్ ఉదయం తుదిశ్వాస విడిచారు. దేవేన్ భార్య రూపా గంగూలీ. 1961లో ‘ధర్మపుత్ర’ చిత్రంతో తెరంగేట్రం చేసిన దేవేన్.. వందకుపైగా చిత్రాల్లో నటించారు.
 
 అంగూర్, గోల్‌మాల్, బుడ్డా మిల్‌గయా, కట్టామీఠా, దిల్, దిల్‌తో పాగల్‌హై తదితర చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. 1982లో విడుదలైన ‘అంగూర్’ చిత్రంలో దేవేన్‌వర్మ పోషించిన హాస్య పాత్ర బాలీవుడ్ చిత్రసీమలో ఎప్పటికీ నిలిచిపోదగిన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది. దేవేన్ నిర్మాతగా ఎనిమిది చిత్రాలు కూడా నిర్మించారు. ఒక చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. చివరిగా దాదాపు పదేళ్ల కింద ‘మెరె యార్‌కీ షాదీ హై, కలకత్తా మెయిల్’ చిత్రాల్లో నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement