డీఎల్‌ఎఫ్ ఆజీవన్ సమృద్ధి
ప్రైవేటురంగ జీవిత బీమా కంపెనీ డీఎల్‌ఎఫ్ ప్రమెరికా లైఫ్ హోల్‌లైఫ్ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.
ప్రైవేటురంగ జీవిత బీమా కంపెనీ డీఎల్‌ఎఫ్ ప్రమెరికా లైఫ్ హోల్‌లైఫ్ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఆజీవన్ సమృద్ధి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పాలసీలో 99 ఏళ్ల వరకు జీవిత బీమా రక్షణ ఉండటం అనేది ప్రధానమైన ఆకర్షణ. అలాగే ప్రీమియం పరిమిత కాలానికి చెల్లిస్తే సరిపోతుంది. ప్రీమియం కనీసం 15 నుంచి గరిష్టంగా 20 ఏళ్లపాటు చెల్లిస్తే చాలు 99 ఏళ్ల వరకు బీమా రక్షణ ఉంటుంది. పాలసీదారునికి 65 ఏళ్లు పూర్తయితే పాలసీ మొత్తం, గ్యారంటీ ఎడిషన్, బోనస్ చెల్లిస్తారు. ఆ తర్వాత కూడా బీమా రక్షణ కొనసాగుతుంది. ఆ తర్వాత క్లెయిమ్ జరిగితే పాలసీ మొత్తం, ఇతర బోనస్‌లు ఏమైనా ఉంటే అవి కలిపి నామినీకి చెల్లిస్తారు. ఈ పాలసీని 8 నుంచి 50 ఏళ్ల లోపు వారు తీసుకోవచ్చు.