అణుశక్తి కమిషన్ చైర్మన్గా శేఖర్ బసు
న్యూఢిల్లీ: భారత అణుశక్తి కమిషన్ (ఏఈసీ) నూతన చైర్మన్ గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్ బసు నియమితులయ్యారు. ప్రస్తుతం అణు శక్తి ఆయుధ కర్మాగారం (ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్) చీఫ్ గా ఉన్న ఆయనను ఏఈసీ చైర్మన్ గా నిమిస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
అణు ధార్మిక శక్తితో నడిచే మొట్టమొదటి సబ్ మరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ రూపకల్పనలో శేఖర్ బసుది కీలకపాత్ర. ఈ జలాతర్గామి రాకతో భారత నౌకాదళ శక్తి రెట్టింపయినట్లయింది.11 నెలలపాటు ఆయన ఏఈసీ చైర్మన్ పదవిలో కొనసాగుతారు.